Making of Ice cream: మీరు ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇకపై తినడానికి భయపడతారేమో..
ABN , Publish Date - Jun 19 , 2025 | 09:18 AM
చాలా మంది పిల్లలతో పాటు పెద్దలు కూడా ఐస్‌క్రీమ్ లేదా ఐస్ ఫ్రూట్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వేసవిలో చల్ల చల్లగా ఉంటుందని ఇష్టంగా తింటుంటారు. అయితే ఆ ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం భయంతో వణకాల్సిందే.
చాలా మంది పిల్లలతో పాటు పెద్దలు కూడా ఐస్‌క్రీమ్ (Ice Cream) లేదా ఐస్ ఫ్రూట్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వేసవిలో చల్ల చల్లగా ఉంటుందని ఇష్టంగా తింటుంటారు. అయితే ఆ ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం భయంతో వణకాల్సిందే. కనీస శుభ్రత పాటించకుండా తయారు చేసే ఆ ఐస్‌క్రీమ్‌లను తింటే రోగాలు రావడం గ్యారెంటీ. ఓ లోకల్ ఐస్ ఫ్యాక్టరీలో ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేస్తున్నారో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Making of Ice cream).
@alim\_uddin\_04 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను (Viral Video) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ లోకల్ ఐస్ ఫ్యాక్టరీలో ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేస్తున్నారో చూపించారు. మొదట ఆ ఫ్యాక్టరీలో కార్మికులు మురికి ప్లాస్టిక్ బకెట్లలో నీటిని తీసుకుని పెద్ద నీలిరంగు డ్రమ్‌లో వేశారు. ఆ డ్రమ్‌లో ఉన్న నీటిలో కలర్, షుగర్ వేశారు. తర్వాత ఆ మిశ్రమాన్ని పాప్సికల్ అచ్చులలో నింపి ఫ్రీజర్‌లో ఉంచారు. అది గడ్డకట్టిన తర్వాత ఒక బుట్టలో ప్యాక్ చేసి నేరుగా మార్కెట్‌కు పంపేశారు.
ఆ తయారీ ప్రాసెస్‌లో వారు ఎక్కడా పరిశుభ్రతపై కనీస శ్రద్ధ చూపలేదు. ఆ తయారీ ప్రక్రియను వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. కనీస శుభ్రత లేదని, వాటిని తింటే రోగాలు రావడం ఖాయమని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: హోటల్‌లో ప్రియుడితో సరసాలు.. భర్త రాగానే ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే..
మీ మెదడుకు సవాల్.. ఈ కూరగాయల మధ్యనున్న చెర్రీని 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..