Terrifying Video: త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.. సెకెన్ల వ్యవధిలోనే ఏం జరిగిందో ఒకసారి చూడండి..
ABN , Publish Date - Jul 21 , 2025 | 07:19 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఆ వీడియోలో కుర్రాళ్లు త్రుటిలో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఏమాత్రం తేడా జరిగినా వారందరూ భారీ ప్రవాహంలో కొట్టుకుని పోయి ప్రాణాలను కోల్పోయి ఉండేవారు.
మనం ఏమి కోల్పోయినా తిరిగి పొందే వీలుంటుంది. అయితే ప్రాణాలు కోల్పోతే మాత్రం అంతా అయిపోయినట్టే. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఆ వీడియోలో కుర్రాళ్లు త్రుటిలో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఏమాత్రం తేడా జరిగినా వారందరూ భారీ ప్రవాహంలో కొట్టుకుని పోయి ప్రాణాలను కోల్పోయి ఉండేవారు (Viral Video).
@Sumanjodhpur అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ముగ్గురు పిల్లలు ఓ సెలయేటిలో నిలబడి ఉన్నారు. అక్కడ నీరు (Water) చాలా తక్కువగా ఉంది. అయితే అదే సమయంలో పైన ఉన్న ఆనకట్ట (Dam) గేట్లను ఓపెన్ చేశారు. దీంతో భారీగా నీరు దూసుకు రావడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన ఆ కుర్రాళ్లు ఒడ్డు వైపు వేగంగా పరుగులు పెట్టారు. వారు ఒడ్డుకు చేరుకున్న సెకెను వ్యధిలోనే నీరు కూడా భారీగా అక్కడకు చేరుకుంది. అయితే అప్పటికే వారు ఒడ్డుకు వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.3 లక్షల మంది వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అంత పెద్ద ప్రమాదం తరుముతున్నా వారు ఎంత నెమ్మదిగా పరిగెడుతున్నారో చూడండి అంటూ ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ పిల్లి ప్రమాదాన్ని ఎలా పసిగట్టిందో చూడండి.. యజమానిని కాపాడి..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..