Share News

Funny Robbery video: దొంగతనం చేశారా.. చేయనిచ్చారా.. వీడియో చూస్తే ఆశ్చర్యంతో నివ్వెరపోవాల్సిందే..

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:11 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే వాస్తవ దృశ్యాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Funny Robbery video: దొంగతనం చేశారా.. చేయనిచ్చారా.. వీడియో చూస్తే ఆశ్చర్యంతో నివ్వెరపోవాల్సిందే..
thieves with hammer and gun

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే వాస్తవ దృశ్యాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి (viral CCTV video). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జరిగిన దొంగతనం చూస్తే షాక్ అవ్వాల్సిందే (Jewellery shop robbery).


@Rassmalai_ అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నగల దుకాణం దగ్గరకు ఇద్దరు దొంగలు వచ్చారు. ఒక దొంగ తన చేతిలో ఉన్న సుత్తితో ఆ షాప్ అద్దాన్ని పగలగొడుతున్నాడు. ఆ అద్దం గట్టిగా ఉండడంతో అది అంత సులభంగా పగలలేదు. ఇంతలో ఆ షాప్‌లోని అమ్మాయి నగలన్నీ తెచ్చి.. పక్కనున్న రెండో దొంగకు ఇచ్చేసింది. అతడి చేతిలో తుపాకీ ఉంది. ఆ దొంగ ఆ నగలను తీసుకుని తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (crime caught on camera).


ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3.8 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. షాప్‌లోని అమ్మాయే దొంగతనం చేయనిచ్చిందని ఒకరు కామెంట్ చేశారు. ఆ అమ్మాయి అంత భయపడేలా ఆ దొంగలు ఏం చేశారని మరొకరు ప్రశ్నించారు. ఆ షాప్‌లోని అమ్మాయి ఆ దొంగలకు ఫ్రెండ్ అయి ఉంటుందని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..


మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2025 | 11:11 AM