Shocking Video: ఓర్నీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా.. ఓ వ్యక్తి ఇంజినాయిల్ ఎలా తాగేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:56 PM
కొందరు వీడియోల కోసం తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆ విచిత్ర వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోక తప్పదు. ఎందుకంటే ఆ వీడియోలోని వ్యక్తి బైక్ ఇంజినాయిల్‌ను డ్రింక్ తాగుతున్నట్టు తాగేస్తున్నాడు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోంది. వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. తమ ప్రాణాలతో, ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఆ విచిత్ర వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోక తప్పదు. ఎందుకంటే ఆ వీడియోలోని వ్యక్తి బైక్ ఇంజినాయిల్ (Bike Engine Oil)ను డ్రింక్ తాగుతున్నట్టు తాగేస్తున్నాడు.
mkvibes87 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్ పక్కన కూర్చుని.. 'ఫ్రెండ్స్.. ఈ రోజు నేను ఉదయం నుంచీ ఏమీ తినలేదు, తాగలేదు. కాబట్టి ఈ రోజు నేను నా బైక్ ఇంజిన్ ఆయిల్ తాగబోతున్నాను' అని చెప్పాడు. అనంతరం బైక్ ఇంజిన్ నుంచి కారుతున్న నల్లని, చిక్కటి ఆయిల్‌ను తాగుతున్నాడు. కొంత తాగిన తర్వాత అతడి నోటి నుంచి ఇంజినాయిల్ బయటకు కూడా వచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఇంజిన్ ఆయిల్ తాగడం అత్యంత ప్రమాదకరం. ఈ విషపూరిత పదార్థం ఊపిరితిత్తులు, కాలేయం, మొత్తం శరీరాన్ని నాశనం చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది ఈ వీడియోను చూసి తమ స్పందనలను తెలియజేశారు. 'బ్రదర్.. మీరు చనిపోవాలనుకుంటే, నేరుగా విషం తాగండి. ఈ ఇంజిన్ ఆయిల్ ఎందుకు' అని ఒకరు ప్రశ్నించారు. సోషల్ మీడియా వ్యూస్, లైక్స్ కోసం ఇలాంటి పనులు చేసే వారు కూడా ఉంటారా అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
మీ భార్య ఇబ్బంది పెడుతోందా, మీరు లవ్ ఫెయిల్యూరా.. ఆ టీ స్టాల్‌లో టీ మీకోమే మరి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో భిన్నమైన టీ పాట్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..