Share News

Funny Video: అయ్యో.. వర్షం ఎంత పని చేసింది.. అమ్మాయిల మొహాలు ఎలా అయిపోయాయో చూడండి..

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:20 AM

మేకప్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎన్నో అడుగులు ముందున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయితే అమ్మాయిలు మేకప్ కోసమే గంటలు గంటలు కేటాయిస్తారు. అమ్మాయిల మేకప్ గురించి ఇప్పటికే ఎన్నో జోక్‌లు బయటకు వచ్చాయి. అమ్మాయిల మేకప్‌నకు సంబంధి తాజాగా ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది.

Funny Video: అయ్యో.. వర్షం ఎంత పని చేసింది.. అమ్మాయిల మొహాలు ఎలా అయిపోయాయో చూడండి..
Rain ruined the makeup of girls

ప్రస్తుత కాలంలో మేకప్ (Make up) అనేది అందరికీ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వస్తే కచ్చితంగా మేకప్ ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ మేకప్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎన్నో అడుగులు ముందున్నారు (Girls Make up). పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయితే అమ్మాయిలు మేకప్ కోసమే గంటలు గంటలు కేటాయిస్తారు. అమ్మాయిల మేకప్ గురించి ఇప్పటికే ఎన్నో జోక్‌లు బయటకు వచ్చాయి. అమ్మాయిల మేకప్‌నకు సంబంధి తాజాగా ఓ ఫన్నీ వీడియో (Funny Video) బయటకు వచ్చింది.


memes_gallery అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. భారీ వర్షం (Rain) కురిసి తగ్గిపోయింది. ఆ వర్షంలో తడిసిన కొందరు అమ్మాయిల మొహాలు మేకప్ పోయి భయంకరంగా తయారయ్యాయి. వారి మొహాలను చూపిస్తూ ఫన్నీగా ఆ వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో అమ్మాయిలను చూస్తే భయపడాల్సిందే. ఆ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల మంది వీక్షించారు. 22 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. 'పాపం.. దేవదూతలు దెయ్యాలుగా మారిపోయారు' అని ఒకరు కామెంట్ చేశారు. సహజ సౌందర్యానికి వర్షం మరింత అందాన్ని ఇస్తుందని మరొకరు పేర్కొన్నారు. రోడ్ల మీద ఇలా తిరిగి పిల్లలను భయపెట్టకండి అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మెడలో పామును పెట్టుకుని బైక్ డ్రైవింగ్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

మీ చూపు షార్ప్ అయితే.. ఈ అడవిలో కప్ కేక్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2025 | 11:20 AM