Share News

Lower berth trick: రైల్లో లోయర్ బెర్త్ పొందడం ఎలా.. టీటీఈ చెప్పిన సీక్రెట్ ఏంటంటే..

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:04 PM

రైల్లో ప్రయాణించే సమయంలో అందరూ లోయర్ బెర్త్ పొందాలని కోరుకుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ రావాలని బలంగా కోరుకుంటారు. టికెట్ రిజర్వేషన్ చేసుకునేటపుడు 'లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్' కూడా ఎంటర్ చేస్తారు.

Lower berth trick: రైల్లో లోయర్ బెర్త్ పొందడం ఎలా.. టీటీఈ చెప్పిన సీక్రెట్ ఏంటంటే..
railway lower berth guide

రైల్లో ప్రయాణించే సమయంలో అందరూ లోయర్ బెర్త్ పొందాలని అనుకుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ రావాలని బలంగా కోరుకుంటారు. టికెట్ రిజర్వేషన్ చేసుకునేటపుడు 'లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్' కూడా ఎంటర్ చేస్తారు. అయినా వారికి లోయర్ బెర్త్ రాదు. అయితే రైల్లో లోయర్ బెర్త్ రావాలనుకుంటే ఏం చేయాలో వివరిస్తున్న టీటీఈ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (TTE hack for Lower berth).


ఈ వీడియోను దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12424)లో చిత్రీకరించారు. టీటీఈకి నలుగురు సీనియర్ సిటిజన్లు తమ 3ఏసీ టిక్కెట్లను చూపించి.. 'సీనియర్ సిటిజన్లు అయినప్పటికీ మాకు లోయర్ బెర్త్‌లు ఎందుకు ఇవ్వలేదు' అని ప్రశ్నించారు. దానికి టీటీఈ ఓ ట్రిక్ చెప్పారు. 'మీరు లోయర్ బెర్త్‌లు కావాలని కోరుకుంటే, ఒక పీఎన్‌ఆర్‌లో రెండు టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకోండి. మీరు ఒకే పీఎన్‌ఆర్‌లో మూడు లేదా నాలుగు టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పుడు, సిస్టమ్ దానిని గ్రూప్ బుకింగ్‌గా పరిగణిస్తుంది. లోయర్ బెర్త్‌లను కేటాయించదు' అని వివరించారు (train travel hack).


@jalveshp అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (railway booking tips). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. టీటీఈ అద్భుతమైన చిట్కా చెప్పారని చాలా మంది ప్రశంసించారు. ఇకపై తాను ఈ ట్రిక్‌ను ఉపయోగించి చూస్తానని మరొకరు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 11 , 2025 | 01:36 PM