Snake Video: పామును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన రాజస్థాన్ వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - Jun 25 , 2025 | 09:34 PM
రాజస్థాన్‌లోని ఓ వ్యక్తి జైపూర్ హాస్పిటల్‌కు వెళ్లి భయాందోళనలు సృష్టించాడు. ఓ సంచి తీసుకుని నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాడు. అతడి చేతిలో ఉన్న సంచిలో ఓ పెద్ద పాము ఉంది. హాస్పిటల్‌లోకి వెళ్లిన తర్వాత అందరి ఎదురుగా సంచిలో నుంచి పామును తీసి బయట పెట్టాడు. దీంతో అందరూ షాకయ్యారు.
రాజస్థాన్ (Rajasthan)లోని ఓ వ్యక్తి జైపూర్ హాస్పిటల్‌కు వెళ్లి భయాందోళనలు సృష్టించాడు. ఓ సంచి తీసుకుని నేరుగా హాస్పిటల్‌కు (Hospital) వెళ్లాడు. అతడి చేతిలో ఉన్న సంచిలో ఓ పెద్ద పాము (Snake) ఉంది. హాస్పిటల్‌లోకి వెళ్లిన తర్వాత అందరి ఎదురుగా సంచిలో నుంచి పామును తీసి బయట పెట్టాడు. దీంతో అందరూ షాకయ్యారు. ఆ పాము తనను కరిచిందని, వెంటనే తనకు చికిత్స అందించాలని వేడుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ మంగళ్ వెల్లడించారు. ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి ఓ భారీ పామును తీసుకుని తమ హాస్పిటల్‌కు వచ్చాడని చెప్పారు. పొలంలో పని చేసుకుంటుండగా ఆ వ్యక్తిని ఆ పాము కుట్టింది. ఆ పాము విషపూరితమైనదా, కాదా అని నిర్ధారించుకోవడం కోసం దానిని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. అది విషపూరిత రస్సెల్ వైపర్ పాము కావడంతో డాక్టర్లు వెంటనే అతడికి చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రకాశ్ మండల్‌ను చికిత్స కోసం తీసుకెళ్తున్నప్పుడు కూడా అతడు ఆ పామును వదలడానికి నిరాకరించాడు. పామును వదలకపోతే చికిత్స చేయడం కుదరదని డాక్టర్లు చెప్పడంతో అతడు పామును తన కుటుంబ సభ్యులకు అప్పగించాడు. వారు దానిని బయటకు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత వైద్యులు అతడికి చికిత్స చేసి కాపాడారు. కాగా, ప్రకాశ్ మండల్ పాముతో హస్పిటల్‌కు వచ్చినపుడు అక్కడున్న రోగులు, హాస్పిటల్ సిబ్బంది భయపడిపోయారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఆహా.. దొంగలంటే ఎంత మర్యాద.. సైకిల్ దొంగతో ఓనర్ ఏమన్నాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో Mల మధ్యనున్న Nను 5 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..