Funny Viral Video: ఆహా.. దొంగలంటే ఎంత మర్యాద.. సైకిల్ దొంగతో ఓనర్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:28 PM
సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే ఎవరైనా ఏం చేస్తారు. దొంగ.. దొంగ.. అని కేకలు పెట్టి చుట్టుపక్కల వారిని పిలుస్తారు. లేదా దొంగను బంధించి పోలీసులకు అప్పగిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వ్యక్తి మాత్రం దొంగ పట్ల మర్యాదగా ప్రవర్తించాడు. చోరీ చేయమని అతడిని ఎంకరేజ్ చేశాడు.
సాధారణంగా ఇంట్లో దొంగలు (Thief) పడితే ఎవరైనా ఏం చేస్తారు. దొంగ.. దొంగ.. అని కేకలు పెట్టి చుట్టుపక్కల వారిని పిలుస్తారు. లేదా దొంగను బంధించి పోలీసులకు అప్పగిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వ్యక్తి మాత్రం దొంగ పట్ల మర్యాదగా ప్రవర్తించాడు. చోరీ చేయమని అతడిని ఎంకరేజ్ చేశాడు. అయితే ఆ దొంగ భయపడి పారిపోయాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@cute_taddy అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ఇంట్లోకి ప్రవేశించిన దొంగ సైకిల్‌ను (Bicycle) చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. సైకిల్‌ను గేట్ బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ అక్కడకు వచ్చాడు. వీడియో తీస్తూ అక్కడకు వచ్చి.. సైకిల్ తాళం కావాలా అని దొంగను అడిగాడు. షాకైన దొంగ అక్కడి నుంచి పారిపోవడానికి గేటు ఎక్కాడు. అప్పుడు ఆ యజమాని.. 'పారిపోకు, తీసుకెళ్లు. తీసుకో అన్నయ్య, ఇది నాకు కూడా పనికిరాదు. అది కిందపడి పాడైపోతుంది. నేను కూడా ఒకప్పుడు పిల్లవాడి సైకిల్ దొంగిలించాను' అని చెబుతున్నాడు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేసి ఆ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ వీడియో చూస్తే దొంగల సమాజం మొత్తం సిగ్గుపడుతుందని ఒకరు కామెంట్ చేశారు. ఆ వ్యక్తి దొంగతో ఎంత మర్యాదగా ప్రవర్తించాడని ఒకరు పేర్కొన్నారు. దొంగ అనవసరంగా భయపడి పారిపోయాడని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో Mల మధ్యనున్న Nను 5 సెకెన్లలో కనిపెట్టండి
షాకింగ్.. 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రష్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..