Jugaad Trick: ఐడియా బాగుంది కదా.. వర్షంలో పిల్లలు తడవకుండా ఎలా ఏర్పాటు చేశారో చూడండి..
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:38 PM
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని సులభంగా పరిష్కరిచడంలో భారతీయులు ఒకడుగు ముందుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని సులభంగా పరిష్కరించడంలో భారతీయులు ఒకడుగు ముందుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos)సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వర్షం (Rain) పడుతున్నప్పుడు పిల్లలు తడవకుండా చేసిన ఏర్పాటు అందరినీ ఆకట్టుకుంటోంది (Viral Video).
@chicagobachi అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. స్కూల్ బస్సు దిగిన విద్యార్థులు వర్షంలో తడవకుండా ఓ అపార్ట్‌మెంట్ దగ్గర ఓ చక్కటి ఏర్పాటు చేశారు. భారీ టెంట్ లాంటి దానిని ఏర్పాటు చేశారు. అది ముందుకు కదులుతోంది. ఆ టెంట్‌లో పిల్లలు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ఆ పిల్లలు తడవకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది అద్భుతమైన ఏర్పాటు అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటిది అందరూ ఏర్పాటు చేసుకోవడం కష్టం అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..