Share News

SBI Manager Viral Video: ఆఫీసులో రీల్స్ చేస్తూ ఎస్‌బీఐ మేనేజర్ వీడియో వైరల్

ABN , Publish Date - Nov 09 , 2025 | 07:34 AM

ఎస్‌బీఐ ఉద్యోగి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ కార్యాలయంలో వర్క్ చేస్తుండగా.. ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

SBI Manager Viral Video: ఆఫీసులో రీల్స్ చేస్తూ ఎస్‌బీఐ మేనేజర్ వీడియో వైరల్
SBI Manager Viral Video

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 9: ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల సమస్యలను తీర్చేవిగా ఉంటాయి. సమస్యలతో వచ్చిన వ్యక్తికి బాధ్యతాయుతమైన అధికారి పరిష్కారం చూపించాలి. ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా ఇలాగే ఉంటుంది. అయితే కొందరు బాద్యతాయుతమైన పదవిలో ఉంటూనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ యూజర్ సమస్యలను పరిష్కరించకపోగా, కార్యాలయాల సమయాన్ని వృథా చేస్తుంటారు. గంటల తరబడి వేచిచూస్తున్న తమ ఖాతాదారుల సమస్యలపై దృష్టి పెట్టకపోగా.. పని ఎప్పుడు అవుతుందని అడిగిన వారిపైనే అరుస్తారు. అధికారం బలం చూపిస్తూ దురుసుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త మారింది. చాలా మంది రీల్స్ చేయడంలో మునిగిపోతుంటారు. చివరికి ఆ వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారుతారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి, తన తోటి మహిళా ఉద్యోగితో రీల్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈయన ఎంప్లొయీ మాత్రమే కాదు.. బ్యాంక్ లో మేనేజర్. ఆఫీసులో వర్క్ చేస్తుండగానే బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్.. ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ డ్యాన్స్ చేశాడు. మహిళా ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్ వెనుక ఉండి పాటకు లిప్ సింక్ కలుపుతూ ఉంటే.. బ్రాంచ్ మేనేజర్ కుర్చీలో కూర్చొని హావభావాలు పలికించాడు. అయితే ఈ వీడియోలో ఉద్యోగి వెనుక భాగంలో అవార్డులు/ట్రోఫీలు ఉన్నాయి.


అంతేకాదు డెస్క్‌పై కంప్యూటర్, ఫైల్స్, కూడా ఉన్నాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆయన.. ఇలా ఆఫీస్ సమయాన్ని వృథా చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ హాలిజమ్ vs రొమాన్స్‌ హైలెట్ అవుతుండగా.. ఇండియన్ బ్యాంకిగ్ సర్కిల్స్‌లో ఎక్కువగా షేర్ అవుతోంది. ‘బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు’, ‘పబ్లిక్ ఆఫీసులు ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉన్నాయా?’, ‘నేను ఎస్‌బీఐని కోరుకుంటుందేంటంటే.. వాళ్లు లవ్ బర్డ్స్.. వాళ్లను సస్పెండ్ చేయకండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం

మహారాష్ట్ర మంత్రుల మెడకుభూ కొనుగోళ్ల ఉచ్చు

Updated Date - Nov 09 , 2025 | 07:34 AM