Woman Reappears After 2 Years: ఆమె చనిపోయిందని అందరూ అనుకున్నారు.. కానీ, రెండేళ్ల తర్వాత..
ABN , Publish Date - Oct 02 , 2025 | 08:14 PM
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మహిళ భర్తతో పాటు మరో ఆరుగురిపై కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అప్పటినుంచి నడుస్తూనే ఉంది. అత్తింటి వారు కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరో వైపు పోలీసులు కనిపించకుండా పోయిన ఆ మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిందనుకున్న మహిళ రెండేళ్ల తర్వాత తిరిగొచ్చి అందర్నీ షాక్‌కు గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఔరాయా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఓ మహిళ 2023లో అత్తింటి నుంచి కనిపించకుండాపోయింది. అత్తింటి వాళ్లు, పుట్టింటి వాళ్లు ఆమె కోసం బాగా వెతికారు. పోలీసులకు సైతం కంప్లైంట్ చేశారు. అయినా ఆమె కనిపించలేదు. దీంతో మహిళ తల్లిదండ్రులు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. అదనపు కట్నంకోసం తమ కూతుర్ని చంపేసి, శవం కనిపించకుండా చేశారని కేసు పెట్టారు.
విచారణ జరిపిన కోర్టు భర్తతో పాటు అత్తింట్లోని వారందరిపై కేసు ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మహిళ భర్తతో పాటు మరో ఆరుగురిపై కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అప్పటినుంచి నడుస్తూనే ఉంది. అత్తింటి వారు కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరో వైపు పోలీసులు కనిపించకుండా పోయిన ఆ మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు. తాజాగా, ఆమె మధ్య ప్రదేశ్‌లో కనిపించింది.
ఔరాయా సర్కిల్ ఆఫీసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘పెళ్లైన సంవత్సరంన్నరకే ఆ మహిళ ఇంటినుంచి పారిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు ఫైల్ చేశాము. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అత్తింటి వారిపై కేసు ఫైల్ చేశాము. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మహిళ మధ్య ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించాము. బుధవారం ఆమెను ఔరాయాకు తీసుకువచ్చాము. దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
గవర్నమెంట్ జాబ్ కోసం తల్లిదండ్రుల దారుణం.. అప్పుడే పుట్టిన బిడ్డను..
మానవత్వాన్ని ప్రశ్నించే ఘటన.. కటిక నేలపై గర్భిణికి ప్రసవం