Parents Dump Infant In Forest: గవర్నమెంట్ జాబ్ కోసం తల్లిదండ్రుల దారుణం.. అప్పుడే పుట్టిన బిడ్డను..
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:53 PM
చీమలు బిడ్డను విపరీతంగా కరిచాయి. కొరుక్కు తినే చలిలో బిడ్డ అల్లాడిపోయింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం నందన్‌వాడీ గ్రామస్తులు అటువైపు వచ్చారు.
మధ్యప్రదేశ్: గవర్నమెంట్ జాబ్ కోసం ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అప్పుడే పుట్టిన బిడ్డను అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారాకు చెందిన బబ్లూ దండోలియా ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య రాజ్ కుమారి తాజాగా, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను పెంచుకోకూడదని వారు డిసైడ్ అయ్యారు. అసలు ఆ బిడ్డ పుట్టిన సంగతే ప్రపంచానికి తెలియకూడదని అనుకున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదని దంపతులు భావించారు. ఇప్పటికే వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగో బిడ్డ గురించి తెలిస్తే కచ్చితంగా ఉద్యోగం పోతుందని భయపడ్డారు. అందుకే బిడ్డను అడవిలో వదిలేయాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ 23వ తేదీన రాజ్ కుమారి ఇంట్లోనే డెలివరీ అయింది. బిడ్డ పుట్టిన గంటల్లోనే బబ్లూ అడవిలోకి తీసుకెళ్లాడు. ఓ రాయి కింద బిడ్డను దాచి ఇంటికి వచ్చేశాడు.
పాపం పసికందు అడవిలో నరకం చూసింది. చీమలు బిడ్డను విపరీతంగా కరిచాయి. కొరుక్కు తినే చలిలో బిడ్డ అల్లాడిపోయింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం నందన్‌వాడీ గ్రామస్తులు అటువైపు వచ్చారు. బిడ్డ అరుపులు విని రాయి దగ్గరకు వెళ్లారు. బిడ్డను రక్షించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బిడ్డ పరిస్థితి మెరుగైంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మానవత్వాన్ని ప్రశ్నించే ఘటన.. కటిక నేలపై గర్భిణికి ప్రసవం
లాటరీల జోలికెళ్లన వ్యక్తికి సడెన్‌గా బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.17 కోట్లు