ఈ జంటకు డాగ్ షెల్టరే పెళ్లి వేదిక..
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:59 PM
చైనాకు చెందిన 31 ఏళ్ల యాంగ్ ఒకప్పుడు వ్యాపారవేత్త. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతడు వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూశాడు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో సొంత ఇల్లు, రెండు కార్లను అమ్మేసి... జీతాలు చెల్లించాల్సి వచ్చింది.
పెళ్లి అనగానే ప్రీవెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, రిసెప్షన్, బారాత్‌లంటూ ఆర్భాటాలతో ఆడంబరంగా జరుగుతుంటాయి. కానీ ఆ జంటకు మాత్రం డాగ్ షెల్టరే వివాహ వేదికగా మారింది. అక్కడి శునకాలే ప్రధాన అతిథులయ్యాయి.
చైనాకు చెందిన 31 ఏళ్ల యాంగ్ ఒకప్పుడు వ్యాపారవేత్త. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతడు వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూశాడు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో సొంత ఇల్లు, రెండు కార్లను అమ్మేసి... జీతాలు చెల్లించాల్సి వచ్చింది. మిగిలిన డబ్బుతో మూగ జీవుల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. వీధి కుక్కల సంరక్షణకు ప్రత్యేక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న కుక్కలకు ఆశ్రయం కల్పించాడు. 10 కుక్కలతో షెల్టర్‌ను ప్రారంభించగా, ప్రస్తుతం 200 కుక్కలున్నాయి. కొంతమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
కట్‌చేస్తే... 2022లో స్థానిక విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తూ, షెల్టర్‌లో స్వచ్ఛంద సేవకురాలిగా చేరింది 25 ఏళ్ల జావో. కుక్కల పట్ల ఆమె చూపించే ప్రేమ, దయాగుణం యాంగ్‌కి బాగా నచ్చాయి. ఇద్దరి మనసులు కూడా కలిశాయి. అలా ప్రేమలో పడిన ఈ జంట ఇటీవల పెళ్లికి సిద్ధమైంది. తమను కలిపిన డాగ్ షెల్టర్‌నే వివాహ వేదికగా మార్చి, మూగజీవాల సాక్షిగా ఒక్కటైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘మీ ఆలోచన అద్భుతః.. అద్భుతస్య.. అద్భుతోభ్యః’ అంటూ నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
కాంగ్రెస్ కీలక నేత హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Read Latest Telangana News and National News