Lucky escape video: ఈ అంకుల్ వెరీ లక్కీ.. త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి..
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:53 PM
అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడినా ప్రాణాలతో బయటపడవచ్చు అంటుంటారు. కొందరు వ్యక్తులు త్రుటిలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన అలాంటి వీడియోలు కొన్ని మన ముందుకు వచ్చాయి.
అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడినా ప్రాణాలతో బయటపడవచ్చు అంటుంటారు. కొందరు వ్యక్తులు త్రుటిలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన అలాంటి వీడియోలు కొన్ని మన ముందుకు వచ్చాయి. తాజగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు (Near miss accident).
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Uncle accident escape). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి ఒక వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒక గోడ దగ్గరికి వచ్చి అవతలి వైపు చూస్తున్నాడు. అక్కడ సరిగ్గా కనిపించడం లేదని కాస్త పక్కకు జరిగాడు. అదే సమయంలో అతడు ముందుగా నిలబడిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అతడు పక్కకు వెళ్లిపోయాడు. అతడు ముందు నిలబడిన స్థానంలోనే ఉండుంటే పెద్ద ప్రమాదానికి గురయ్యేవాడు. అతడు కేవలం కొన్ని సెకెన్ల తేడాతో బయటపడ్డాడు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (close call accident). ఈ వైరల్ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. 30 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. 'అంకుల్ వేరొకరి ఇంట్లోకి తొంగి చూస్తున్నాడు. దేవుడు అతణ్ని భయపెట్టాడు' అని ఒకరు కామెంట్ చేశారు. నిజంగా అతడు చాలా అదృష్టవంతుడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌లో ఐఫోన్ రేటెంతో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కిడ్నీ అమ్మినా కుదరదేమో..
మీ కళ్లకు పవర్ ఉంటే.. ఈ అడవిలో చిరుతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..