Luxury Car Viral Video: పది వేల బిల్లు చేసి కాస్ట్‌లీ కారులో పరార్.. కట్ చేస్తే..
ABN , Publish Date - Oct 27 , 2025 | 08:58 PM
ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి రాజస్తాన్‌లోని సిరోహి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు. వారు అబు రోడ్‌లోని హాలీడే హోటల్‌లో దిగారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తినడం, తాగటం, రెస్ట్ తీసుకోవటం చేశారు.
ఈ మధ్య కాలంలో మనుషుల్లో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. తమ సుఖాల కోసం ఇతరులు ఏమై పోయినా పర్లేదు అనుకునే వారు ఎక్కువై పోయారు. మోసం చేయటం కొంతమందికి ఓ అలవాటులా మారిపోయింది. దొరకకుండా మోసం చేయటం అంటే గొప్పగా భావిస్తున్నారు. తాజాగా, ఓ ముగ్గురు టూరిస్టులు తాము బస చేసిన హోటల్‌నే మోసం చేయడానికి ప్రయత్నించారు. ఇష్టం వచ్చినట్లు తినితాగి బిల్లు (Hotel Bill Escape Rajasthan) ఎగ్గొడదామని అనుకున్నారు. కాస్ట్‌లీ కారులో హోటల్ నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికే అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి రాజస్తాన్‌లోని సిరోహి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు. వారు అబు రోడ్‌లోని హాలీడే హోటల్‌లో దిగారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తినడం, తాగటం, రెస్ట్ తీసుకోవటం చేశారు. మొత్తం బిల్లు పది వేల రూపాయలు ( 10,900 Hotel Bill) అయింది. ఆ బిల్లు కట్టకుండానే హోటల్‌నుంచి మెల్లగా జారుకున్నారు. కాస్ట్‌లీ కారులో ఉడాయించారు. విషయం తెలుసుకున్న హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంబాజీ రోడ్డులో పోలీసులు టూరిస్టులను పట్టుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు. పది వేల రూపాయల బిల్లు ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన టూరిస్టులపై(Gujarat Tourists Hotel Chase) మండిపడ్డారు. వారితో గొడవపెట్టుకున్నారు. ఇక, ఆ ముగ్గురూ చేసేది ఏమీ లేక డబ్బులు కట్టేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలా ఖరీదైన కార్లలో వచ్చే వారిని నమ్మడానికి వీలు లేదు. చాలా వరకు మోసగాళ్లే ఉంటారు’..‘పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అనంతపురంలో దారుణం.. భార్యతో గొడవలు పెడుతున్నారని..
అరటి తొక్కలను ఇలా వాడితే అద్భుతమైన ఫలితాలు