Boy Assasinated By Neighbor: అనంతపురంలో దారుణం.. భార్యతో గొడవలు పెడుతున్నారని..
ABN , Publish Date - Oct 27 , 2025 | 08:04 PM
గొడవలకు పక్కింటిలోఉండే గోవిందు హరి, నాగవేణిలే కారణమని పెన్నయ్య భావించాడు. భార్య తనతో గొడవలు పెట్టుకునేలా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పక్కింటి వారిపై కక్ష పెంచుకున్నాడు.
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో తనకు గొడవలు పెడుతున్నారనే కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. పక్కింట్లో ఉండే ఐదేళ్ల బాలుడ్ని హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా దోబీ ఘాట్‌లో పూడ్చేశాడు. అయితే, ఆ వ్యక్తి చేసిన ఘోరం చాలా త్వరగానే బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పెన్నయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి నగరంలోని అరుణోదయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ గొడవలకు పక్కింటిలోఉండే గోవిందు హరి, నాగవేణిలే కారణమని పెన్నయ్య భావించాడు. భార్య తనతో గొడవలు పెట్టుకునేలా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పక్కింటి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజున గోవిందు హరి, నాగవేణి దంపతుల ఐదేళ్ల బిడ్డ సుశాంత్‌ను చంపేశాడు. సుశాంత్ కనిపించకపోవటంతో తల్లిదండ్రులు అంతా వెతికారు. బాలుడు ఎక్కడా కనిపించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడు కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, అదే రోజు రాత్రి సుశాంత్ శవాన్ని పెన్నయ్య తన ఇంటి వెనకాల ఉన్న దోబీ ఘాట్‌లో పూడ్చేశాడు. పోలీసుల దర్యాప్తులో బాలుడు హత్యకు గురైనట్లు తేలింది. పెన్నయ్యే ఈ హత్య చేసినట్లు వెల్లడైంది.
ఇవి కూడా చదవండి
అరటి తొక్కలను ఇలా వాడితే అద్భుతమైన ఫలితాలు
మీర్‌పేట్ మర్డర్ కేస్.. వెలుగులోకి సంచలన విషయాలు..