Cooking Tips: మీ వేళ్లపై అంటుకునే పిండిని వదిలించుకోవడానికి 5 సులభమైన మార్గాలు ఇవే
ABN , Publish Date - Feb 18 , 2025 | 09:36 AM
చేతి వేళ్ల నుండి అంటుకునే పిండిని తొలగించడం చాలా కష్టం. దీనిని తొలగించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, మీ వేళ్లపై అంటుకునే పిండిని వదిలించుకోవడానికి 5 సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Get Rid Of Sticky Dough On Your Fingers: రోటీలు, చపాతీలను అందరూ ఎంతో ఇష్టంతో తింటారు. అయితే, వీటిని చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా వాటి పిండిని కలపడం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వాటి పిండిని కొంచెం నూనె, నీటితో కలిపేటప్పుడు ఆ పిండి చేతి వేళ్లకు అంటుకుని ఉంటుంది. దానిని తొలగించుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే, పిండిని వదిలించుకోవడానికి 5 సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పొడి పిండిని ఉపయోగించండి:
పిండి కేవలం రోటీలు, చపాతీలు తయారు చేయడానికి మాత్రమే కాదు అది మీ చేతులకు అంటుకోకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మీ వేళ్లకు పిండి ఎక్కువగా అంటుకుని ఉంటే కొద్దిగా పొడి పిండిని చేతి వేళ్లపై వేసుకుని మీ చేతులను సున్నితంగా రుద్దండి. అంటుకున్న పిండి చేతి వేళ్ల నుండి ఈజీగా ఊడిపోతుంది. ఎందుకంటే పొడి పిండి అదనపు తేమను గ్రహిస్తుంది.
2. కొంచెం నూనె రాయండి:
మీ చేతులను పూర్తిగా పిండి లేకుండా ఉంచుకోవాలనుకుంటే, తేలికపాటి నూనెను ఉపయోగించండి. పిండిని పట్టుకునే ముందు మీ అరచేతులపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెను రుద్దండి. నూనె మీ చేతి వేళ్లకు పిండి అంటుకోకుండా నిరోధిస్తుంది.
3. చల్లని నీరు ఉపయోగించండి:
చాలా మంది గోరు వెచ్చని నీటితో చేతులను కడుకుంటే వేళ్ల నుండి పిండి త్వరగా పోతుందని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే గోరువెచ్చని నీటి నుండి వచ్చే వేడి గ్లూటెన్‌ను సక్రియం చేస్తుంది, పిండిని మరింత జిగటగా చేస్తుంది. బదులుగా, చల్లటి నీటితో మీ చేతులను శుభ్రం చేసుకోండి. చల్లటి నీరు పిండిని గట్టిపరుస్తుంది, పండిని చేతి వేళ్ల నుండి తొలగించడం సులభం చేస్తుంది.
4. స్క్రబ్ చేయండి:
ఒక టీ స్పూన్ చక్కెర లేదా ఉప్పు తీసుకొని మీ అరచేతుల మధ్య సహజమైన ఎక్స్‌ఫోలియంట్ లాగా రుద్దండి. ఇది జిగటగా ఉన్న పిండిని విరిచి, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్క్రబ్ చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మీ చేతులు తర్వాత చాలా మృదువుగా అనిపిస్తాయి.
5. ఆరనివ్వండి:
పై వన్ని ప్రయత్నించినా మీ చేతి వేళ్ల నుండి పిండి వదలకపోతే మీరు మీ చేతులపై ఉన్న పిండిని కొన్ని నిమిషాలు ఆరనివ్వండి. అది కొద్దిగా గట్టిపడిన తర్వాత, మీరు మీ చేతులను రుద్దితే పిండి రాలిపోతుంది. కొన్నిసార్లు ఓపిక కూడా చాలా ముఖ్యం. అది గట్టిగా మారకముందే శుభ్రం చేసుకోండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే..