Share News

Online Dating: ఆన్‌లైన్ డేటింగ్ సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి..

ABN , Publish Date - Jan 26 , 2025 | 01:30 PM

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అనేక డేటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మీరు ఎవరైనా తెలియని వ్యక్తిని సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు.

Online Dating: ఆన్‌లైన్ డేటింగ్ సమయంలో  ఈ విషయాలను గుర్తుంచుకోండి..
Online Dating

Online Dating: ఈ మధ్యకాలంలో డేటింగ్‌ యాప్‌ వాడకం ఎక్కువ అయింది. 18 నుంచి 29 సంవత్సరాల వయసు మధ్య గల వారు దీనిని ఎక్కువగా వాడతారు. ఆన్‌లైన్ డేటింగ్ అంటే సోషల్ మీడియాలో మనకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడి వారితో రిలేషన్‌షిప్ లో ఉండటం. అయితే, ఆన్‌లైన్ డేటింగ్ సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, ఎందుకంటే వ్యక్తులు ఇందులో తమ నిజాలను దాచే అవకాశం ఉంటుంది. అవతల వారిని కేవలం ఆన్‌లైన్ ద్వారా నమ్మి మోసపోకండి. ఫస్ట్ టైం మీరు నేరుగా కలవాలనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి..

పబ్లిక్ ప్లేస్: మీరు ఫస్ట్ టైం మీ ఆన్ లైన్ ఫ్రెండ్ ను కలవడానికి పబ్లిక్ ప్లేస్‌ను ఎంచుకోండి. కాఫీ షాప్, రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వంటి రద్దీగా ఉండే, బాగా వెలుతురు ఉండే పబ్లిక్ ప్లేస్‌ని ఎంచుకోండి.

ఎవరికైనా ప్రత్యేకంగా చెప్పండి: మీరు ఎక్కడికి వెళ్తున్నారు? , ఎవరిని కలుస్తున్నారు? అనే విషయాన్ని మీ సన్నిహిత స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యునికి చెప్పండి.

మీ ఫోన్‌ను ఛార్జ్ చేయండి: మీరు వెళ్లే ముందు, మీ ఫోన్‌కు పూర్తిగా ఛార్జీంగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులను కాంటాక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.

మీ గురించి ఎక్కువగా వెల్లడించవద్దు: మీరు మీ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే ఆన్ లైన్ పరిచయాలను మనం నమ్మడానికి లేదు.

Updated Date - Jan 26 , 2025 | 01:33 PM