Share News

Tiger attack video: వామ్మో.. పులి ఇంత క్రూరంగా దాడి చేస్తుందా.. అసలు విషయం చెప్పిన ఆఫీసర్..

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:48 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.

Tiger attack video: వామ్మో.. పులి ఇంత క్రూరంగా దాడి చేస్తుందా.. అసలు విషయం చెప్పిన ఆఫీసర్..
tiger attack video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పెద్ద పులి వేటకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆ వీడియో నిజం కాదని అటవీ శాఖ మాజీ అధికారి సుశాంత నంద క్లారిటీ ఇచ్చారు (forest guard tiger viral).


@Himmu86407253 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. బ్రహ్మపురి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ (చంద్రపూర్ జిల్లా) సీసీటీవీ రికార్డింగ్ అని తెలిపారు. ఆ వీడియోలో గెస్ట్ హౌస్ బయట ఓ గార్డ్ కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా అడవి నుంచి ఓ పెద్ద పులి పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చింది. ఆ ఫారెస్ట్ గార్డ్‌పై దాడి చేసి అతడిని చంపేసింది. అనంతరం అతడి మృతదేహాన్ని అడవిలోకి లాక్కుని వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చాలా మంది ఆ వీడియో చూసి భయపడ్డారు (tiger viral video truth).


ఆ వీడియో అటవీ శాఖ మాజీ అధికారి సుశాంత నంద దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు (Tiger AI Video). ఆ వీడియో నిజమైనది కాదని, ఏఐతో రూపొందించిన వీడియో అని తేల్చి చెప్పారు. 'ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు. పులులు నరమాంస భక్షకులు కాదు. అవి ఆహారం కోసం ఇలా మనుషులను చంపవు. రాజును గౌరవించండి. అలాంటి నకిలీ వీడియోలను నమ్మకండి' అని కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 09 , 2025 | 12:48 PM