Strong teeth man: ఇతడు వాడే పేస్ట్ ఎంటో తెలిస్తే.. పళ్లతో అంత బరువు ఎలా ఎత్తాడో చూడండి..
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:01 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల వారి ప్రతిభ కూడా అందరినీ చేరిపోతోంది. చాలా మంది తమలోని అరుదైన ట్యాలెంట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రదర్శించి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల వారి ప్రతిభ కూడా అందరినీ చేరిపోతోంది. చాలా మంది తమలోని అరుదైన ట్యాలెంట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రదర్శించి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియలాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (unbelievable strength).
@iamkappu అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని రాళ్లను ఓ గిన్నెలో ఉంచి గోడ పైన పెట్టారు. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి తన పళ్లతో ఆ గిన్నెను పట్టుకున్నాడు. చేతులు ఉపయోగించకుండా తన పళ్లతోనే అంత బరువైన గిన్నెను ఎత్తేశాడు. ఆ వ్యక్తి ట్యాలెంట్‌ను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (teeth power).
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3 వేల మందికి పైగా వీక్షించారు (teeth stunt video). వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ సోదరుడు ఏ టూత్‌పేస్ట్ వాడుతున్నాడో తెలిస్తే బాగుణ్ను అని ఒకరు కామెంట్ చేశారు. నేను ఆఫ్రికా నుంచి ఆ టూత్‌పేస్ట్‌ను ఆర్డర్ చేస్తానని ఒకరు పేర్కొన్నారు. అద్భుతమైన ట్యాలెంట్ అని మరొకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఈమెకేమైంది.. వేగంగా వెళ్తున్న రైలు డోర్ దగ్గర నిల్చుని ఏం చేసిందంటే..
చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..