Shocking Video: వామ్మో.. ఈ అంకుల్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసా? వీడియో చూస్తే షాకవడం ఖాయం..
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:26 PM
పెద్ద పెద్ద సంస్థలు సినిమా, క్రికెట్ సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకుని తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటాయి. చిన్న చిన్న సంస్థలు వినూత్నంగా ఆలోచించి జనాలకు తమ ఉత్పత్తులను చేరువ చేస్తాయి. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది మార్కెటింగ్‌లో తమ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు.
తమ ఉత్పత్తులను జనాలకు చేరువ చేసేందుకు, తగినంత పబ్లిసిటీ (Publicity) వచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద సంస్థలు సినిమా, క్రికెట్ సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకుని తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటాయి. చిన్న చిన్న సంస్థలు వినూత్నంగా ఆలోచించి జనాలకు తమ ఉత్పత్తులను చేరువ చేస్తాయి. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది మార్కెటింగ్‌లో తమ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు (Creative Marketing).
@rareindianclips అనే ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఓ వీడియో (Viral Video) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలో ఓ వ్యక్తి చాలా వినూత్నంగా గాజు గ్లాస్‌లను ప్రమోట్ చేస్తున్నాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. గృహోపకరణాలను రిపేర్ చేసే షాప్‌లో ఓ వ్యక్తి ఉన్నాడు. అతడి ముందున్న టైబుల్‌పై ఉన్న ఒక ప్లేట్‌లో తెలుపు రంగు గాజు గ్లాస్‌లు, మరొక ప్లేట్‌లో ఎరుపు రంగు గాజు గ్లాస్‌లు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎగిరి దూకుతూ ముందుగా తెలుపు రంగు గాజు గ్లాస్‌లను వేగంగా పగలగొట్టాడు. ఆ తర్వాత ఎరుపు రంగు గాజు గ్లాసులను కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించాడు.
అతడు ఎంత గట్టిగా కొట్టినా ఆ ఎరుపు రంగు గాజు గ్లాస్‌లు మాత్రం పగలలేదు. దీంతో ఆ ఎరుపు రంగు గాజు గ్లాస్‌లు చాలా బలంగా ఉన్నాయని అర్థమవుతోంది. ఇదొక రకమైన విచిత్రమైన ప్రమోషన్ కార్యక్రమంలా కనిపిస్తోంది. ఆ వ్యక్తి యాక్షన్ చాలా మందిని మెప్పిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు రెండు లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. ఈ ప్రమోషన్ అద్భుతంగా ఉందని కొందరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..