Viral Jugaad: సూపర్ ఐడియా.. భోజనం చేయడానికి ఎలాంటి టేబుల్ సెట్ చేసుకున్నాడో చూడండి..
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:39 AM
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (craftsmanship viral).
rampuri_guru22 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వెరైటీ డైనింగ్ టేబుల్ కనబడుతోంది. మీరు చాలా రకాల డైనింగ్ టేబుళ్లను చూసి ఉంటారు. కానీ ఈ వైరల్ వీడియోలో కనిపించే డైనింగ్ టేబుల్ వాటన్నింటినీ మించిపోతుంది. ఒక వ్యక్తి స్టూల్ పైన సైకిల్ వీల్‌ను అమర్చాడు. దానిపై వివిధ ఆహార పదార్థాలను ఉంచి, వాటిని సులభంగా తిప్పుతున్నాడు. చాలా ఖరీదైన డైనింగ్ టేబుళ్లపైనే ఇలాంటి ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది (talented artisan rewarded).
ఈ వీడియోలోని వ్యక్తి చాలా చవకగా, సులభంగా అలాంటి ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు (viral craftsman video). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. రెండు లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది పేదవాడి డైనింగ్ టేబుల్ అని ఒకరు కామెంట్ చేశారు. ఇతడి ఆలోచనను అభినందించాల్సిందేనని మరొకరు ప్రశంసించారు.
ఇవీ చదవండి:
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..
మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ మంచులో పెంగ్విన్‌ను 15 సెకెన్లలో కనిపెట్టండి..