Viral Video: చావును ఆహ్వానించడం అంటే ఇదే.. రీల్స్ కోసం ఇలాంటి ప్రాణాంతక సాహసం చేస్తారా
ABN , Publish Date - Jun 23 , 2025 | 07:25 PM
ప్రస్తుతం చాలా మంది రీల్స్ కోసం వీడియోలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీల్స్ చేయడంలో తప్పు లేదు. చాలా మంది రీల్స్ కోసం తమ క్రియేటివిటీ, ప్రతిభను ప్రదర్శించేందుకు వాడుతున్నారు. అయితే మరికొద్ది మంది మాత్రం వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది రీల్స్ (Reels) కోసం వీడియోలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీల్స్ చేయడంలో తప్పు లేదు. చాలా మంది రీల్స్‌ను తమ క్రియేటివిటీ, ప్రతిభను ప్రదర్శించేందుకు వాడుతున్నారు. అయితే మరికొద్ది మంది మాత్రం వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాంతక సహసాలు (Dangerous Stunts) చేస్తూ వీడియోలను రికార్డు చేస్తున్నారు. అలాంటి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
@BhanuNand అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు కుర్రాళ్లు బిజీగా ఉన్న రహదారిపై రోలర్ స్కేటింగ్ బూట్లు ధరించి రోడ్డుపై స్కేటింగ్ (skating) చేస్తున్నారు. ఆ రోడ్డు మీద వేగంగా వెళ్తున్న లారీ (Lorry) కిందకు కూడా వెళ్లిపోయి దానిని పట్టుకుని స్కేటింగ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఒక అబ్బాయి ఆ లారీ కింద నుంచి బయటకు వచ్చి విన్యాసాలు చేశాడు. వారు లారీ కింద ఉన్నప్పుడు డ్రైవర్ వేగం తగ్గించినా లేదా బ్రేక్ వేసినా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. వారు ఆ ప్రాణాంతక విన్యాసం చేస్తున్న సమయంలో వేరే వ్యక్తి వారిని రికార్డు చేశాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితం చాలా విలువైనదని వారికి అర్థం అయ్యేలా చెప్పేవారు లేరా అని ఒకరు కామెంట్ చేశారు. జీవితం ఓ ప్రాణాంతక సాహసం కంటే ఎన్నో మిలియన్ రెట్లు పెద్దది అని మరొకరు పేర్కొన్నారు. వారికి ఎప్పటికీ అర్థం కాదు అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఆ కోబ్రా ఎలా నిల్చుందో చూశారా.. వీడియో చూస్తే షాకవడం ఖాయం..
ఆ గుండెకు ధైర్యం ఎక్కువే.. నీటిలోనే మొసళ్లను ఎలా పరిగెత్తించాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..