Share News

India jugaad: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వ్యవసాయం ఎలా చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Nov 08 , 2025 | 08:00 PM

మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు.

India jugaad: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వ్యవసాయం ఎలా చేస్తున్నాడో చూడండి..
Indian invention

మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Indian invention).


@ChandanVer25374 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రైతులకు మధ్యాహ్నం సమయంలో పొలాల్లో పనిచేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అని తెలిసిందే. ఎందుకంటే ఆ సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్ కనిపెట్టాడు. తన తలకు ఓ వస్త్రాన్ని కట్టుకుని దానికి గొడుగును తగిలించాడు. పొలంలో ఎరువులు చల్లుతున్నప్పుడు ఆ గొడుగును తెరిచాడు (Indian creativity).


ఆ గొడుగు నీడలో హాయిగా పొలం పనులు చేసుకుంటున్నాడు (viral jugaad video). ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు 39 వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయోనని ఒకరు ప్రశ్నించారు. వీరు నిజంగా తెలివైన వ్యక్తులు అని మరొకరు పేర్కొన్నారు. సూపర్ టెక్నాలజీ అని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 08 , 2025 | 08:37 PM