Share News

The Rock Shocks Fans: ది రాక్‌కు ఏమైంది?.. మరీ ఇంత సన్నగా అయ్యాడేంటి?

ABN , Publish Date - Sep 03 , 2025 | 08:13 AM

ఓ వీడియోలో రాక్ తనకు దక్కిన గౌరవానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఫొటోలో రాక్ చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.

The Rock Shocks Fans: ది రాక్‌కు ఏమైంది?.. మరీ ఇంత సన్నగా అయ్యాడేంటి?
The Rock Shocks Fans

డ్వయాన్ జాన్సన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ది రాక్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రాక్ డబ్ల్యూడబ్ల్యూఈతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్ల మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఆరు అడుగులపైన ఎత్తుతో.. కండలు తిరిగిన దేహంతో ది రాక్ ఎంతో బలిష్టంగా ఉంటారు. గుండు ఆయనలో ప్రత్యేక ఆకర్షణ. వైల్డ్ బుల్‌లాగా ఉండే ఆయన చాలా సన్నబడిపోయారు. అనారోగ్యం వచ్చిన వాడిలా కనిపిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ది స్మాషింగ్ మిషిన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదలకు ముందే ఈ సినిమాను సోమవారం నాడు ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు.


మాజీ ఎమ్ఎమ్ఏ ఫైటర్ మార్క్ కెర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మార్క్ కెర్ పాత్రలో రాక్ కనిపించనున్నారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా చూసిన వారు రాక్ నటనకు మంత్ర ముగ్ధులయ్యారు. 15 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో రాక్ తనకు దక్కిన గౌరవానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఫొటోలో రాక్ చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.


రాక్ ఆరోగ్యం దెబ్బతిందని, అందుకే బరువు తగ్గాడని పుకార్లు మొదలయ్యాయి. అయితే, ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని తేలింది. ‘ది స్మాషింగ్ మిషిన్’ సినిమా కోసం ఆయన బాగా బరువు తగ్గారట. మార్క్ కెర్ పాత్ర కోసం దాదాపు 27 కిలోల బరువు తగ్గినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎమ్ఎమ్ఏ ఫైటర్ బయోపిక్ కాబట్టి బాడీ ఈజీగా గాల్లోకి లేచేలా ఉండాలని రాక్ అంత బరువు తగ్గారట. తమ అభిమాన హీరోకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలిసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బరితెగించారు.. ఇలా రోడ్డు వేస్తే.. అలా తవ్వుకొళ్లారు..

ట్రేడ్ టారిఫ్‌లతో ఏడు యుద్ధాలు ఆపేశా.. కంగారు పడుతున్న ట్రంప్!

Updated Date - Sep 03 , 2025 | 08:18 AM