Share News

Viral Video: ఇతడిని చూస్తే డాక్టర్లే భయపడతారేమో.. క్షణాల్లో దంతాన్ని ఎలా సెట్ చేశాడో చూడండి..

ABN , Publish Date - Jun 23 , 2025 | 09:43 PM

సోషల్ మీడియా ప్రతిరోజు మన కళ్ల ముందుకు ఎన్నో విచిత్రమైన వీడియోలను తీసుకొస్తూ ఉంటుంది. అందులో కొన్ని వీడియోలు చూసే వారందరినీ విపరీతంగా ఆశ్చర్యపరుస్తాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండేవారు అలాంటి ఎన్నో వీడియోలను చూస్తూ ఉంటారు.

Viral Video: ఇతడిని చూస్తే డాక్టర్లే భయపడతారేమో.. క్షణాల్లో దంతాన్ని ఎలా సెట్ చేశాడో చూడండి..
Funny viral Video

సోషల్ మీడియా ప్రతిరోజు మన కళ్ల ముందుకు ఎన్నో విచిత్రమైన వీడియోలను తీసుకొస్తూ ఉంటుంది. అందులో కొన్ని వీడియోలు చూసే వారందరినీ విపరీతంగా ఆశ్చర్యపరుస్తాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండేవారు అలాంటి ఎన్నో వీడియోలను చూస్తూ ఉంటారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యక్తి చేస్తున్న పని దృశ్యం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).


@meinkiakaruu అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన కూర్చున్న ఒక వ్యక్తి దగ్గర ఒక పెట్టె ఉంది. ఆ పెట్టె లోపల వివిధ సైజులలో దంతాలు (Teeth) ఉన్నాయి. అతడి దగ్గరకు ఓ వ్యక్తి దంతం పెట్టించుకోవడానికి వచ్చాడు. అతడికి సరిపోయే దంతాన్ని పెట్టెలో నుంచి దానికి గమ్ అంటించి అతడి నోటిలో అమర్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన నోటిలో అమర్చి ఉన్న దంతాన్ని చూపించాడు. అంత వేగంగా వైద్యం చేసిన ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇతడిని చూసి ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరూ భయపడుతున్నారు అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఆన్‌లైన్ క్లాస్‌లకు అటెండ్ అయితే దంతవైద్యుడు అయ్యుంటాడని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రమాదకర వైద్యం చేయించుకోకండి అంటూ మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఆ కోబ్రా ఎలా నిల్చుందో చూశారా.. వీడియో చూస్తే షాకవడం ఖాయం..

ఆ గుండెకు ధైర్యం ఎక్కువే.. నీటిలోనే మొసళ్లను ఎలా పరిగెత్తించాడో చూడండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 09:43 PM