Share News

Elephant Video: వామ్మో.. ఏనుగుకు ఆకలి వేస్తే ఇలా ఉంటుందా? ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:39 PM

అభివృద్ధి పేరుతో అడవులను కొట్టేయడం, రోడ్ల కోసం చెట్లు నరికివేయడం మొదలైన కారణాలతో వన్య ప్రాణాలు ఆహారం కోసం, అవాసం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Elephant Video: వామ్మో.. ఏనుగుకు ఆకలి వేస్తే ఇలా ఉంటుందా? ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లి ఏం చేసిందంటే..
Thailand Elephant Store Video

అభివృద్ధి పేరుతో అడవులను కొట్టేయడం, రోడ్ల కోసం చెట్లు నరికివేయడం మొదలైన కారణాలతో వన్య ప్రాణులు (Wild Animals) ఆహారం కోసం, అవాసం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లేదా సామాన్య జనాలకు హాని కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్‌లాండ్‌ (Thailand)లో ఓ ఏనుగు (Elephant)కు ఆకలి వేసింది. దాంతో అది ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Thailand Elephant Store).


bangkokcommunityhelp అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. థాయిలాండ్‌లోని ఖావో యాయ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖావో యాయ్ నేషనల్ పార్క్‌లో నివసించే 23 ఏళ్ల అడవి ఏనుగు ఖావో యాయ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించింది. అది నేరుగా తినుబండరాలు పెట్టి ఉన్న సెక్షన్ వైపు వెళ్లి తనకు కావాల్సినవి తీసుకుంది. ఆ భారీ ఏనుగు ఆ స్టోర్ టాప్‌నకు తగిలేంత పొడవుగా ఉంది. అది తిరిగి వెళ్తూ కొన్ని స్నాక్స్ ప్యాకెట్స్‌ను తీసుకుంది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మంది వీక్షించారు. దాదాపు 70 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటివి సాధారణమే అని కొందరు కామెంట్లు చేయడం విశేషం.


ఇవి కూడా చదవండి..

Tiger Jump Video: వావ్.. ఈ పులిని చూడండి.. ఎంత దూరం జంప్ చేసిందో.. వీడియో వైరల్


కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 01:39 PM