Python vs crocodile: నీటిలో భయంకర యుద్ధం.. కొండచిలువ, మొసలి మధ్య థ్రిల్లింగ్ ఫైట్ చూడండి..
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:09 PM
నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాగే భూమి మీద ఉన్నప్పుడు కొండచిలువ కూడా అత్యంత ప్రమాదకర జంతువు. ఎంత పెద్ద జంతువునైనా అమాంతంగా మింగేయగల సత్తా కొండచిలువ సొంతం.
నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాగే భూమి మీద ఉన్నప్పుడు కొండచిలువ కూడా అత్యంత ప్రమాదకర జంతువు. ఎంత పెద్ద జంతువునైనా అమాంతంగా మింగేయగల సత్తా కొండచిలువ సొంతం. అయితే ఈ రెండు ప్రమాదకర జంతువుల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది. నీటిలోని మొసలికి చిక్కితే ఎంత పెద్ద కొండచిలువైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే కొండచిలువ కూడా అంత త్వరగా లొంగిపోదు (underwater battle).
Latest Sightings అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఓ థ్రిల్లింగ్ వీడియో ప్రస్తుతం చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది (wild animal fight). దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొండచిలువను ఓ మొసలి తన దవడలతో గట్టిగా పట్టుకున్నట్లు కనిపిస్తోంది. మొసలి నుంచి విడిపించుకోవడానికి కొండచిలువ తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నం చేస్తోంది. అప్పుడప్పుడు తన శరీరాన్ని మొసలి చుట్టూ చుట్టి ఫైట్ చేస్తోంది. కొండ చిలువ తన చివరి శ్వాస వరకు పోరాటం చేస్తూనే ఉంది.
చివరకు మొసలి స్థాన బలం ముందు కొండచిలువ ఓడిపోయింది (wildlife encounter). బెన్నీ సాల్జర్ మరియు జూలియన్ గీర్ట్స్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా వీక్షించారు. 12 వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజమైన ప్రకృతి యుద్ధం అని ఒకరు ప్రశంసించారు. ఇది నిజమైన జంగిల్ థ్రిల్లర్ అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..