IT Job Market: 45 లక్షల శాలరీనా.. ఇంత తక్కువైతే ఎలా.. టెకీ అభ్యంతరం నెట్టింట వైరల్
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:26 PM
మూడేళ్ల అనుభవానికి రూ.45 లక్షల శాలరీ ఆఫర్ ఏమాత్రం సబబు కాదంటూ ఓ టెకీ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల పని అనుభవం ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనకు కొత్తగా చేరబోయే కంపెనీ ఇచ్చిన శాలరీ ఆఫర్ ఏమాత్రం సరిపోదంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Techies 45 LPA offer). తనకు కేవలం రూ.45 లక్షల శాలరీ ఆఫర్ వచ్చిందని టెకీ చెప్పుకొచ్చాడు. సుమారు 8 నెలల క్రితం కొత్త సంస్థల్లో చేరిన తన స్నేహితులందరికీ రూ.50 లక్షలకు పైనే వస్తోందని వాపోయాడు.
టెక్నికల్ స్టాఫ్ పొజిషన్ కోసం ఓ సంస్థలో తనకు ఈ శాలరీ ఆఫర్ చేశారని ఆ వ్యక్తి తెలిపారు. రూ.30 లక్షల ఫిక్స్‌డ్ శాలరీతో పాటు రూ.3 లక్షల బోనస్, మిగతాది స్టాక్ ఆప్షన్స్ కింద వస్తుందని అన్నాడు. చూడటానికి ఇది మంచి ఆఫర్‌యే అయినా తనకు ప్రస్తుతం వస్తున్న జీతంతో పోలిస్తే ఇది అంత ఎక్కువేమీ కాదని చెప్పుకొచ్చాడు. ఒకరకంగా చూస్తే శాలరీ తగ్గినట్టుగా కూడా భావించాల్సి వస్తుందని అన్నాడు. ఇతర స్టార్టప్‌ల ఆఫర్‌లు లభించినా తనకు ఆసక్తి లేదని తెలిపాడు. ఇప్పుడేం చేయాలో తెలియట్లేదంటూ పోస్టు పెట్టాడు.
దీనిపై జనాల నుంచి సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడి శాలరీ ఆఫర్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మూడేళ్ల అనుభవానికే ఇంత ప్యాకేజీ ఎలా సాధ్యమని అన్నారు. మరికొందరు అతడి అభిప్రాయంతో ఏకీభవించారు. ఒకప్పటిలా ఇప్పుడు శాలరీలు లేవని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆఫర్ తీసిపారేయాల్సింది కాదని కూడా అన్నారు.
చూడటానికి ఈ ఆఫర్ బాగునే ఉన్నా వాస్తవంగా జీతం చేతికొచ్చే సరికి నిరాశ తప్పదని కూడా తెలిపారు. ‘రెండేళ్ల నుంచి రూ.5లక్షల శాలరీపై పనిచేస్తున్నా నీకు రూ.45 లక్షలు సరిపోదంటే ఎలా’ అని మరో వ్యక్తి అన్నాడు. ఇలా ఈ పోస్టు.. శాలరీలు, ఆశలు, వాస్తవానికి మధ్య అంతరాలు, మార్కెట్‌లో పరిస్థితులపై పెద్ద చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి:
ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..
ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ