Share News

Karnataka Viral News: భార్యను హత్య చేశాడని భర్తను జైల్లో పెట్టిన పోలీసులు.. మామూలు ట్విస్ట్ కాదుగా..

ABN , Publish Date - Apr 05 , 2025 | 08:30 PM

కర్ణాటకలో ఓ దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. భర్త జీవితంతో భార్య ఆడుకున్న తీరు చూసి పెళ్లంటేనే వణుకుపుట్టే పరిస్థితి ఏర్పడింది. కొడగు జిల్లా కుశాల్ నగర్ తాలూకా బసవనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు మల్లిగే అనే యువతితో వివాహం అయ్యింది.

Karnataka Viral News: భార్యను హత్య చేశాడని భర్తను జైల్లో పెట్టిన పోలీసులు.. మామూలు ట్విస్ట్ కాదుగా..
Karnataka Viral News

ఇంటర్నెట్ డెస్క్: ఓ భార్య ఇచ్చిన షాక్‌కు భర్త మైండ్ బ్లాంక్ అయ్యింది. చనిపోయినట్లు నాటకం ఆడిన మహిళ తన భర్తను కటకటాల పాలు చేసింది. ఆమె చనిపోయినట్లు అందరూ భావించినప్పటికీ.. చివరికి వెలుగులోకి వచ్చిన ట్విస్ట్ చూసి పోలీసులు సహా అంతా అవాక్కయ్యారు. సదరు మహిళ చేసిన పని చూసి గ్రామస్థులంతా నోరెళ్లబెట్టారు. ఇలాంటి విడ్డూరం తమ జీవితాల్లోనే ఎప్పుడూ చూదలేదంటూ మహిళకు చివాట్లు పెడుతున్నారు.


కర్ణాటకలో ఓ దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. భర్త జీవితంతో భార్య ఆడుకున్న తీరు చూసి పెళ్లంటేనే వణుకుపుట్టే పరిస్థితి ఏర్పడింది. కొడగు జిల్లా కుశాల్ నగర్ తాలూకా బసవనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు మల్లిగే అనే యువతితో వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు వారి సంసారం హాయిగా సాగింది. అందుకు ప్రతిఫలంగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే 2019 సంవత్సరం వారి జీవితాలను మలుపుతిప్పింది. ఓ రోజు మల్లిగే సడెన్‌గా అదృశ్యమైంది. దీంతో సురేశ్ తన కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి తీవ్రంగా గాలించాడు.


ఎంత వెతికినా మల్లిగే జాడ తెలియలేదు. ఫోన్ చేసినా ఎలాంటి స్పందనా లేదు. నెలలపాటు వెతికానా ప్రయోజనం లేకపోవడంతో 2021లో కుశాల్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు సురేశ్. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖాకీలు. కొన్నాళ్లు గడిచిన తర్వాత 2022 సంవత్సరంలో ఓ రోజు సురేశ్‌ను పోలీసులు సంప్రదించారు. పెరియపట్నం తాలూకా బెట్టడపుర సమీపంలో మృతదేహం దొరికిందని, అది మల్లిగేదేనని ఆమె తల్లికి, సురేశ్‌కి చెప్పారు. బరువెక్కిన హృదయంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొన్ని రోజులకే మల్లిగేను హత్య చేసింది సురేశే అంటూ పోలీసులు అరెస్టు చేశారు. సురేశ్ ఎంత చెప్పినా అతని మాటలు వినలేదు.


అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏళ్లపాటు జైల్లో ఉన్న తర్వాత డీఎన్‌ఏ రిపోర్టులో ఆ మృతదేహం మల్లిగేది కాదని తేలింది. దీంతో నిర్దోషిగా విడుదల అయ్యాడు సురేశ్. ఇక్కడే సినిమా రేంజ్ ట్విస్ట్ ఇచ్చింది మల్లిగే. ఏప్రిల్ 01, 2025న మల్లిగే తన ప్రేమికుడితో కలిసి సురేశ్ స్నేహితుల కంట పడింది. వాళ్లిద్దరూ మడికేరిలోని ఓ హోటల్‌లో చెక్ ఇన్ అవుతుండటం బాధితుడి స్నేహితులు చూశారు. వెంటనే ఫొటోలు తీసి సురేశ్‌కు పంపారు. వాటిని తీసుకుని పోలీసుల వద్దకు పరుగులు పెట్టాడు సురేశ్. ఆ ఫొటోలు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని మల్లిగేను అదుపులోకి తీసుకుని మైసూర్ కోర్టులో హాజరుపరిచారు. కాగా, విషయం తెలిసిన బసవనహళ్లి గ్రామస్థులంతా మల్లిగేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అమాయకుడి జీవితాన్ని నాశనం చేసిందంటూ మండిపడుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఆ మూడు పార్టీలు ఒక్కటే: ఎంపీ లక్ష్మణ్..

Bus Conductor Problems: అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..

Weather Report: దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎప్పట్నుంచి అంటే..

Updated Date - Apr 05 , 2025 | 08:30 PM