Share News

Air India Survivor: అతడు అబద్ధం చెబుతున్నాడు.. విమాన ప్రమాద బాధితుడిపై నటి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:10 PM

ఎయిర్‌ ఇండియా ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక ప్యాసెంజర్ అబద్ధం చెబుతున్నాంటూ ఓ ప్రముఖ నటి వ్యాఖ్యానించడం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీస్తోంది.

Air India Survivor: అతడు అబద్ధం చెబుతున్నాడు.. విమాన ప్రమాద బాధితుడిపై నటి షాకింగ్ కామెంట్స్
Suchitra Krishnamoorthi Air India tweet

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో కనిపించే విషయాలను యథాతథంగా నమ్మడం.. ముందూ వెనకా ఆలోచించకుండా స్పందించడం.. ఇతరులకు షేర్ చేయడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. సరిగ్గా ఇదే పొరపాటు చేసిన నటి సుచిత్ర కృష్ణమూర్తి చిక్కుల్లో పడ్డారు . జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గిన ఆమె ఆ తరువాత క్షమాపణలు కూడా తెలిపారు. పాత పోస్టును డిలీట్ చేసినట్టు కూడా వెల్లడించారు.

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో బతికిబయటపడ్డ ఒకే ఒక ప్యాసెంజర్ విశ్వాస్‌కుమార్ రమేశ్. అతడి కథనంపై అనేక తప్పుడు అంశాలు సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అసత్యం చెబుతున్నట్టు కొందరు వదంతులు పుట్టించారు. ఈ విషయాల్ని సుచిత్ర కూడా పంచుకున్నారు. విశ్వాస్ కథనాన్ని ప్రశ్నిస్తూ నెట్టింట ఓ పోస్టు పెట్టారు. అతడు అసత్యం చెబుతున్నాడని మండిపడ్డారు.


‘విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక ప్యాసింజర్ తానని చెప్పుకుంటూ విశ్వాస్ కుమార్ అసత్యాలు చెబుతున్నాడా? ఇది వినడానికి నిజంగా వింతగా ఉంది. అతడి కుటుంబం ఎందుకు స్పందించలేదు? తన సోదరుడి అంత్యక్రియల్లో అతడు పాల్గొన్న విషయం మాటేమిటీ? అని ప్రశ్నించారు. ఇదంతా నిజమైతే.. ఇలాంటి వాళ్లను కచ్చితంగా శిక్షించాలి. మానసిక చికిత్స చేయించాలి’ అంటూ పోస్టు పెట్టారు.

దీంతో, నటిపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అసత్యాలను నెట్టింట పంచుకుంటున్నావంటూ జనాలు ఆమెపై దుమ్మెత్తిపోశారు. అతడు చెప్పిన వివరాలను అహ్మదాబాద్‌లోని ఆసుపత్రి ధ్రువీకరించిన విషయాన్ని పేర్కొన్నారు. దీంతో, గంటల వ్యవధిలోనే నటిపై విమర్శల జడి పతాక స్థాయికి చేరింది.


ఈ నేపథ్యంలో సుచిత్ర స్పందిస్తూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పింది. తన మునుపటి పోస్టు డిలీట్ చేసినట్టు పేర్కొంది. ‘ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిపై చేసిన పోస్టును తొలగించా. ఇదేదో అసత్య ప్రచారంలా ఉంది. ఇలాంటి వాటిని ఎందుకు వ్యాప్తి చేస్తారో తెలియదు’ అని వివరణ ఇచ్చుకుంది.

ఇవి కూడా చదవండి:

ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ

ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Jun 20 , 2025 | 12:33 PM