Share News

student prank viral: వార్నీ.. ఈ కుర్రాడు మమూలోడు కాదు.. ఐ ఫోన్ బాక్స్‌ను ఎలా మార్చాడో చూడండి..

ABN , Publish Date - Nov 26 , 2025 | 08:31 PM

ఫన్నీ డియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ కుర్రాడు వెరైటీగా చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

student prank viral: వార్నీ.. ఈ కుర్రాడు మమూలోడు కాదు.. ఐ ఫోన్ బాక్స్‌ను ఎలా మార్చాడో చూడండి..
paratha in iPhone box

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ కుర్రాడు వెరైటీగా చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (iPhone box paratha video).


@hariom5sharma అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ తరగతి గదిలో చిత్రీకరించారు. ఓ కుర్రాడు తన క్లాస్ రూమ్‌కు ఐఫోన్ బాక్స్ తీసుకొచ్చాడు. అంత ఖరీదైన ఐఫోన్ బాక్స్‌ను చూసి టీచర్ ఆశ్చర్యపోయారు. ఆ కుర్రాడు ఆ బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న పరాఠాలను చూపించాడు. దీంతో టీచర్ షాకయ్యారు. అలా ఎవరు ప్యాక్ చేశారని టీచర్ అడిగితే.. తానేనని ఆ కుర్రాడు సమాధానం ఇచ్చాడు (paratha in iPhone box).


ఈ వెరైటీ టిఫిన్ బాక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (funny classroom video). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.4 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'నేను నా ఇయర్‌బడ్స్‌లో ఊరగాయ తీసుకురావడం మర్చిపోయాను' అని ఒకరు కామెంట్ చేశారు. ఈ కుర్రాడు చాలా తెలివైన వాడని కొందరు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 26 , 2025 | 08:31 PM