Stone Pelting on Temple: బెంగళూరులో బంగ్లాదేశ్ వ్యక్తి దారుణం.. గుడిలోకి ప్రవేశించి..
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:17 PM
ఆ వ్యక్తి చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించాడు. దేవుడి విగ్రహంపై కూడా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకుని అతడ్ని పట్టుకున్నారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడని భావిస్తున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ గుడిలోకి ప్రవేశించి దేవుడి విగ్రహంపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూరులో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, దేవరబీసనహళ్లి గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన ఓ గుడి ఉంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి బాగా తాగి గుడి దగ్గరకు వచ్చాడు.
రాయితో గుడి ధ్వజ స్తంభంపై దాడి చేశాడు. ఆ వెంటనే చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించాడు. దేవుడి విగ్రహంపై కూడా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకుని అతడ్ని పట్టుకున్నారు. దేహశుద్ది చేసి చెట్టుకు కట్టేశారు. అతడ్ని విచారించగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. సనాతన అనే ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ అయింది.
ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై వైట్ ఫీల్డ్ బెంగళూరు డీసీపీ ఆఫీస్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో ‘ఆ ఘటనకు సంబంధించి మారత్త హళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. నిందితుడ్ని అరెస్ట్ చేశాము. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది. ఆ నిందితుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కోరిక తీర్చలేదని భార్యపై భర్త దారుణం..
మొంథా తుపాన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు