Share News

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:15 AM

వైరస్ ఆందోళనల నేపథ్యంలో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అయితే కొద్ది సేపటికే ఆ లాభాలు ఆవిరయ్యాయి. కనిష్టాల వద్ద కొనుగొళ్లు సాగినప్పటికీ మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండడం మార్కెట్లను కుంగదీస్తోంది.

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు..
Stock Market

వైరస్ ఆందోళనల నేపథ్యంలో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అయితే కొద్ది సేపటికే ఆ లాభాలు ఆవిరయ్యాయి. కనిష్టాల వద్ద కొనుగొళ్లు సాగినప్పటికీ మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండడం మార్కెట్లను కుంగదీస్తోంది. దీంతో లాభాలతో ప్రారంభమైన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. (Business News).


సోమవారం ముగింపు (77, 964)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 55 పాయింట్ల స్వల్ప లాభంతో మొదలైన సెన్సెక్స్ క్షణాల్లోనే మరింత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభపడి 78, 452వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత ఆరంభ లాభాలను కోల్పోయింది. 500 పాయింట్లకు పైగా కోల్పోయి 77, 956 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం పది గంటల సమయంలో 5 పాయింట్ల స్వల్ప లాభంతో 77, 970 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం పది గంటల సమయంలో 25 పాయింట్ల లాభంతో 23, 639 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో బయోకాన్, ఎన్‌సీసీ, ఓఎన్‌జీసీ, యూపీఎల్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, జొమాటో, ఇన్ఫో‌ఎడ్జ్, మహానగర్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 251 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్ల లాభంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.67గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 07 , 2025 | 10:15 AM