Saudi Arabia: 30 ఏళ్ల తర్వాత.. సౌదీ ఎడారిలో మంచు వర్షం..
ABN , Publish Date - Dec 23 , 2025 | 07:20 AM
సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎప్పుడు వేడిగా ఉండే సౌదీ ఎడారిలో ఇప్పుడు తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్లు కనిపిస్తుంది. ఎడారిలో మంచు కురవడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచిన అద్భుత దృశ్యం.
ఎప్పుడూ భగ భగమంటూ కనిపించే సౌదీ ఎడారి(Saudi Arabia)ని ఇప్పుడు మంచు(Snow) దుప్పటి కప్పేసింది. వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా సోమవారం ఉదయం అక్కడ కనిపించిన అరుదైన దృశ్యాల(Rare sightings)ను చూసి ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఇదెక్కడి చోద్యం అంటున్నారు. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలలో 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు జీరో(Temparatures)కి పడిపోతున్నాయి. దీంతో ఉత్తర, మధ్య ప్రాంతంలో వింతైన వాతావరణ (Strange weather) పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. 2,600 మీటర్ల ఎత్తులో ట్రొజెనా (Trogena)పై భారీగా మంచు వర్షం (Snowfall) కురిసింది. అల్-జౌఫ్ (Al-Jauf), హెయిల్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా తబుక్ ప్రావిన్స్(Tabuk Province)లోని పర్వత శ్రేణు (Mountain Ranges)ల్లో మంచు విపరీతంగా కురియడంతో ఎక్కడ చూసినా మంచగడ్డలు దర్శనమిస్తున్నాయి. చరిత్రలో ఎడారి ఇసుక తిన్నెలు మంచుతో కప్పబడిపోవడం ఇదే మొదటిసారి అని నిపుణులు అంటున్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం..ఇటీవల అరేబియా సముద్రం నుంచి వీచిన తేమతో కూడిన గాలులు, అల్పపీడన ప్రభావంతో భూభాగంపైకి వచ్చి అసాధారణ వర్షాలకు దారితీశాయని అంటున్నారు. ఇక సౌదీ వాతావరణ కేంద్రం స్పందిస్తూ.. అకాల వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు చెప్పాలని రియాద్‌లోని స్కూల్స్ యాజమాన్యాలను అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఎడారిలో కురుస్తున్న మంచు దృశ్యాలు సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
సుపరిపాలనకు ప్రజలు పట్టం.. గోవాలో బీజేపీ విక్టరీపై మోదీ
గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్