Share News

Clever trick video: బ్రెయిన్ వాడితే.. శ్రమ తగ్గుతుంది.. ఈ వ్యక్తి ఇసుకను గోనెలో ఎలా వేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:50 PM

మనదేశంలో చాలా మంది సామాన్యులు అద్భుతమైన తెలివితేటలను వినియోగిస్తుంటారు. రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. కష్టమైన పనులను చాలా సులువుగా చేస్తుంటారు. బ్రెయిన్ ఉపయోగించి శ్రమ తగ్గించుకుంటారు.

Clever trick video: బ్రెయిన్ వాడితే.. శ్రమ తగ్గుతుంది.. ఈ వ్యక్తి ఇసుకను గోనెలో ఎలా వేస్తున్నాడో చూడండి..
smart work video

మనదేశంలో చాలా మంది సామాన్యులు కూడా అద్భుతమైన తెలివితేటలను వినియోగిస్తుంటారు. రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. కష్టమైన పనులను చాలా సులువుగా చేస్తుంటారు. బ్రెయిన్ ఉపయోగించి శ్రమ తగ్గించుకుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి గోనెలోకి ఇసుకను ఎత్తడానికి సులభమైన ట్రిక్ కనిపెట్టాడు (Smart work video).


@UNavodayan అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Productivity hack). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఇసుకను గోనెల్లోకి ఎత్తే పని చేస్తున్నాడు. సాధారణంగా ఇసుకను గోనెలోకి ఎత్తడం కాస్త కష్టం. గోనెను పట్టుకునేందుకు మరో వ్యక్తి ఉండాలి. అయితే ఆ వ్యక్తి గోనెలో ఓ భారీ ప్లాసిక్ పైప్‌ను పెట్టి దానిలోకి ఇసుకను వేస్తున్నాడు. గోనె నిండిన తర్వాత ఆ పైప్‌ను బయటకు తీసేస్తున్నాడు. అలా చేయడం వల్ల పని చాలా త్వరగా పూర్తయిపోతోంది (Creative shortcut).


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (work smarter not harder). దాదాపు మూడు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఇతడి ఐడియా అద్భుతంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. స్మార్ట్‌గా ఆలోచిస్తే హార్డ్ వర్క్ తగ్గుతుందని మరొకరు ప్రశంసించారు. నిర్మాణ రంగంలో ఉండే వారు ఎన్నో సులభమైన ట్రిక్స్ కనిపెడతారని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

విపత్తు సమయంలోనూ వ్యాపారం.. అతడు కార్న్ స్టాల్ ఎక్కడ పెట్టాడో చూడండి..


మీది సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోల్లో మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2025 | 06:50 PM