Sister of crows: ఈమె ట్యాలెంట్ అద్భుతం.. కాకులను ఎలా మోసం చేసిందో చూడండి..
ABN , Publish Date - Sep 16 , 2025 | 07:32 PM
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించడంలోనే వారి ప్రత్యేకత దాగి ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యుల ప్రతిభ కూడా అందరినీ చేరుతోంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారి ట్యాలెంట్‌కు కూడా గుర్తింపు లభిస్తోంది.
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించడంలోనే వారి ప్రత్యేకత దాగి ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యుల ప్రతిభ కూడా అందరినీ చేరుతోంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారి ట్యాలెంట్‌కు కూడా గుర్తింపు లభిస్తోంది. తాజాగా ఓ యువతి మిమిక్రీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ట్యాలెంట్‌కు మనుషులే కాదు.. కాకులు కూడా షాక్ అవుతున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (woman imitates crows).
@GurmeetBha53034 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (crow call expert). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి తన ఇంటి డాబా మీద ఉంది. మరో వ్యక్తి ఆమెను వీడియో తీస్తున్నాడు. ఆమె కాకుల తరహాలో అరవగలదని, ఆమె అరుపులు విని కాకులు వస్తాయని చెబుతున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో ఒక్క కాకి కూడా లేదు. అయితే ఆమె అరిచిన కొన్ని సెకెన్ల వ్యవధిలోనే కాకులు అక్కడకు రావడం మొదలుపెట్టాయి. ఆమె అచ్చం కాకి తరహాలోనే అరిచింది. ఆ అరుపు ఎక్కడి నుంచి వస్తోందో తెలియక కాకులు అయోమయానికి గురయ్యాయి (sister of crows).
ఆ వీడియోను (bird mimicry) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆమె కాకుల సహోదరి అని ఒకరు కామెంట్ చేశారు. 'వావ్.. సూపర్ ట్యాలెంట్' అని మరొకరు ప్రశ్నించారు. ఆమె మిమిక్రీలో చాలా పైకి రాగలదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. ఈ తెలివికి సలాం చెప్పాల్సిందే.. బైక్ టైర్‌లో గాలి ఎలా నింపుతున్నాడో చూడండి..
మీ దృష్టికి పరీక్ష.. ఈ బెడ్రూమ్‌లో సీతాకోకచిలుక ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..