Share News

నిశ్శబ్ద నేస్తాలు... ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు...

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:17 PM

దిలో, ఆఫీసులో టేబుల్‌ మీద ఉండే సిస్టమ్‌ ముందుగానీ లేదా లాప్‌టాప్‌ మీదగానీ పనిచేసేవారికి ఒకరకంగా శ్వాస ఆడదు. మీటింగులనీ, ఈ మెయిల్సనీ కుర్చీలోంచి కదలడానికి కూడా సమయం ఉండదు. అలాంటివారు కూర్చున్న చోటనే కాసింత రిలాక్స్‌ అయ్యేందుకు ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు వస్తున్నాయి.

నిశ్శబ్ద నేస్తాలు... ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు...

గదిలో, ఆఫీసులో టేబుల్‌ మీద ఉండే సిస్టమ్‌ ముందుగానీ లేదా లాప్‌టాప్‌ మీదగానీ పనిచేసేవారికి ఒకరకంగా శ్వాస ఆడదు. మీటింగులనీ, ఈ మెయిల్సనీ కుర్చీలోంచి కదలడానికి కూడా సమయం ఉండదు. అలాంటివారు కూర్చున్న చోటనే కాసింత రిలాక్స్‌ అయ్యేందుకు ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు వస్తున్నాయి. చిన్న చిన్న కుండీల్లో ఉండే ఈ మొక్కలు మానసికంగా ఎంతో ఉపశమనాన్ని అందిస్తున్నాయి. అందుకే వాటిని పెట్స్‌లాగా పెంచే ట్రెండ్‌ మొదలయ్యింది...

డెస్క్‌ప్లాంట్‌కు మీరు కూర్చున్న డెస్క్‌కు అందాన్ని ఇవ్వడంతో పాటు ఆ గదిలోని గాలిని ఫిల్టర్‌ చేస్తుందని మర్చిపోవద్దు. పైగా పెట్స్‌లాగే ఈ మొక్కలు కూడా మానసిక ఉల్లాసానికి ఎంతో మేలు చేస్తాయి.


సాధారణంగా పెంపుడు జంతువులు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. వాటితో కాసేపు వాకింగ్‌ చేస్తే ఒత్తిడి దూరం అవుతుంది. అదేవిధంగా డెస్క్‌ మీద ఉంచే మొక్కలు కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. పైగా పెట్స్‌లాగా వాటిపట్ల ఎలాంటి అటెన్షన్‌ ఉంచాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి కొన్ని నీళ్లు చిలకరిస్తే చాలు.

గదిలో ఆక్సిజన్‌ అందించే మొక్కల్లో ప్రస్తుతం జేడ్‌, స్నేక్‌ప్లాంట్‌ రకాలకు

ఎక్కువ డిమాండ్‌ ఉంది.

అయితే వాటి సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా మొక్కలకు వెలుతురు సోకేలా చూడాలి.


book5.2.jpg

డెస్క్‌ మొక్కల విషయంలో తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ కాలం మనగలిగే వాటినే ఎంపిక చేసుకోవాలి. అంటే కాండంలో, ఆకుల్లో నీటిశాతం అధికంగా ఉండే జాతి మొక్కలైతే మంచిది. వాటిపై అటెన్షన్‌ లేకున్నా బతికేస్తాయి. స్నేక్‌ప్లాంట్‌లాంటి వాటికి వారానికి ఒకసారి కాసిన్ని నీళ్లు పోసినా చాలు. పోతోస్‌, స్పైడర్‌ మొక్కలకు కాస్త ఎండ సోకితే సరిపోతుంది.

మొక్కలున్న చోట 15 శాతం ఉత్పాదకత పెరుగుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. డెస్క్‌ప్లాంట్స్‌ ఒత్తిడిని తగ్గించి, ఆలోచనలకు ఉత్తేజాన్నిస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు దోహదం చేస్తాయి.


సహజమైన గాలి ఆడని గదుల్లో తప్పకుండా కొన్ని రకాల రసాయనాలుంటాయి. వాటిని స్నేక్‌ప్లాంట్‌, పీస్‌ లిల్లీలాంటి మొక్కలు

ఫిల్టర్‌ చేస్తాయని ‘నాసా’ వాయు నాణ్యతా పరిశోధనలో తేలింది. అందుకే టేబుల్‌ మీద ఈ మొక్కలుంటే ఒకవైపు మీ పని మీరు చేసుకుంటుంటే, మరోవైపు వాటి పని అవి చేస్తుంటాయి.

స్పైడర్‌ ప్లాంట్‌ పిల్ల మొక్కల్ని కూడా ఇస్తుంది. ఎంచక్కా వాటిని మరిన్ని చోట్ల పెంచుకోవచ్చు. స్నేక్‌ ప్లాంట్‌ను సరదాగా ‘అత్తగారి నాలుక’ అని పిలుస్తారు గానీ అవి చాలా మేలు చేస్తాయి.

Updated Date - Feb 16 , 2025 | 12:21 PM