Funny Video: నాలుగు పెగ్గులేస్తే ఇలాగే ఉంటుంది.. నడి రోడ్డు మీద ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:41 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బెంగళూరులోని నడి రోడ్డుపై ఓ వ్యక్తి చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్ల చేస్తున్నారు (Bengaluru road video).
@gharkekalesh అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (viral Bengaluru footage). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బెంగళూరులోని బాగా బిజీగా ఉన్న ఓ రోడ్డుపై ఓ వ్యక్తి పరుపు వేసుకుని దర్జాగా పడుకున్నాడు. కాలు మీద కాలు వేసుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు. దీంతో ఆ రోడ్డు మీద వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అతడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా హాయిగా పడుకున్నాడు. ఈ వ్యక్తి తాగి ఉన్నాడా లేదా మానసిక సమస్యతో బాధపడుతున్నాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఏదేమైనా ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (India viral video).
ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు (Trending India video). ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. నాలుగు పెగ్గులేస్తే ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒకరు కామెంట్ చేశారు. ఓ మైగాడ్.. అతడికి ఏమైందని మరొకరు ప్రశ్నించారు. ఈ వైరస్ బెంగళూరుకు కూడా చేరిందా అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
విపత్తు సమయంలోనూ వ్యాపారం.. అతడు కార్న్ స్టాల్ ఎక్కడ పెట్టాడో చూడండి..
మీది సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోల్లో మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..