Shocking road accident: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఓ బైకర్ ఏం చేశాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:35 PM
అతి వేగం అత్యంత ప్రమాదకరం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయినా చాలా మంది ఆ మాటలను పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. బిజీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి అతి వేగంగా ప్రయాణించి రోడ్డు పక్కనున్న సిమెంట్ నిర్మాణాన్ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరాడు.
అతి వేగం అత్యంత ప్రమాదకరం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయినా చాలా మంది ఆ మాటలను పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. బిజీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి అతి వేగంగా ప్రయాణించి రోడ్డు పక్కనున్న సిమెంట్ నిర్మాణాన్ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరాడు (Bike crash footage). అయితే అదృష్టవశాత్తూ అతడు గాయాలతో బయటపడ్డాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Motorcyclist accident video).
ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో వెనుక వస్తున్న కారు డాష్‌క్యామ్‌లో రికార్డ్ అయింది (Shocking road accident,). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బైకర్ రోడ్డుపై వేగంగా తన బైక్‌ను నడుపుతున్నాడు. ఆ రోడ్డు వాహనాలతో బిజీగా ఉండడంతో మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అతడు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ నిర్మాణాన్ని ఢీకొట్టాడు. దీంతో అతడి బైక్ గాల్లోకి లేచింది. బైక్‌తో పాటు రోడ్డు మీద పడిన అతడు కూడా చాలా పల్టీలు కొట్టాడు. అయితే తలకు హెల్మెట్ ఉండడం అతడిని కాపాడింది (Viral crash video).
రోడ్డు మీద పడిన వెంటనే అప్రమత్తమైన అతడు వేగంగా పక్కకు వెళ్లిపోయాడు. ఎందుకంటే వెనుక ఓ కార్ వస్తోంది. వేరే వాహనదారులు వెంటనే అతడి దగ్గరకు వచ్చి సపర్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 22 లక్షల మందికి పైగా వీక్షించారు. 60 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..