Snake Ramp Walk: వామ్మో.. ఈ పాము నడక మోడల్‌ను మించిపోయిందిగా.. ఎలా ర్యాంప్ వాక్ చేస్తోందో చూడండి..
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:10 PM
ఉద్యోగాలు చేసే వారు, చదువుకునే వారు ఉదయాన్నే తమతో పాటు లంచ్ బాక్స్‌లను తీసుకెళ్తుంటారు. స్టీల్, ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం ప్యాక్ చేసి తీసుకెళ్లడం సులభ కాబట్టి అందరూ వాటినే వాడుతుంటారు. అయితే మీరు రోజూ భోజనం తీసుకెళ్లే క్యారేజ్ ఎలా ఉందో నిరంతరం తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగాలు చేసే వారు, చదువుకునే వారు ఉదయాన్నే తమతో పాటు లంచ్ బాక్స్‌లను (Lunch Box) తీసుకెళ్తుంటారు. స్టీల్, ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం ప్యాక్ చేసి తీసుకెళ్లడం సులభం కాబట్టి అందరూ వాటినే వాడుతుంటారు. అయితే మీరు రోజూ భోజనం తీసుకెళ్లే క్యారేజ్ ఎలా ఉందో నిరంతరం తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు (Viral Video).
wasim_shaikh1137 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ప్యాక్ చేసిన లంచ్ బాక్స్‌ను ఓ వ్యక్తి తెరిచాడు. ఆ బాక్స్ మూతపై ఓ లార్వా (Larvae) ఉంది. ఆ లార్వా ఎలా కదులుతోందో ఆ వీడియోలో ఆ వ్యక్తి చూపించాడు. నేరుగా ఫుడ్ మీదనే లార్వా కనబడడంతో అందరూ షాకవుతున్నారు. అలాంటి లంచ్‌బాక్స్‌లను ఉపయోగించవద్దని ఆయన తల్లిదండ్రులు, కార్యాలయ ఉద్యోగులను హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు (Larvae Inside Packed Tiffin Lid).
శుభ్రం చేయని లేదా తక్కువ నాణ్యత గల లంచ్‌బాక్స్‌లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. సౌకర్యాలు ఎంత మెరుగ్గా ఉంటే, అవి అంత ప్రమాదకరమైనవని మరొకరు హెచ్చరించారు. మంచి నాణ్యత గల స్టీల్ బాక్సులను మాత్రమే వాడాలని, చౌకైన రబ్బరును ఉపయోగించడం చాలా ప్రమాదకరమని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..