Share News

Wild boar vs leopard: చిరుత షాకింగ్ ప్రవర్తన.. అడవి పందిని చూసి తనెవరో మర్చిపోయిందా?

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:22 PM

సింహంతో పాటు పెద్దపులి, చిరుతలు క్రూరమృగాలు. అడవిలోని ఇతర జంతువులన్నీ వీటికి భయపడతాయి. వీటికి ఆకలి వేసిందంటే అడవిలో జంతువులకు ఆయువు మూడినట్టే. జింకలు, అడవి పందులు, కుందేళ్లు వంటి జంతువులు కనిపిస్తే చాలు.. ఈ జంతువులు దాడికి సిద్ధమవుతాయి.

Wild boar vs leopard: చిరుత షాకింగ్ ప్రవర్తన.. అడవి పందిని చూసి తనెవరో మర్చిపోయిందా?
wildlife moments

సింహంతో పాటు పెద్దపులి, చిరుతలు, హైనాలు క్రూర మృగాలు. అడవిలోని ఇతర జంతువులన్నీ వీటికి భయపడతాయి. వీటికి ఆకలి వేసిందంటే అడవిలో జంతువులకు ఆయువు మూడినట్టే. జింకలు, అడవి పందులు, కుందేళ్లు వంటి జంతువులు కనిపిస్తే చాలు.. ఈ జంతువులు దాడికి సిద్ధమవుతాయి (wild boar vs leopard). అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియోలో అడవి పందిని చూసి చిరుత పరుగులు పెట్టింది (Leopard chased by wild boar).


ఐఎఫ్‌ఎస్ అధికారి @ParveenKaswan తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఓ చిరుత సేద తీరుతోంది. పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ అడవి పంది బయటకు వచ్చింది. ఆ అడవి పంది మీద చిరుత దాడి చేస్తుందని అందరూ భావించారు. అయితే ఆ అడవి పందిని చూసి చిరుత భయపడింది. దీంతో ఆ అడవి పంది చిరుతను వెంబడించి దాడి చేయడానికి ప్రయత్నించింది. చిరుత ప్రాణభయంతో పరుగులు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియా జనాలకు షాకిస్తోంది (unexpected wildlife moments).


ఈ వీడియో (wildlife video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఆ చిరుత తాను క్రూరమృగాన్ని అనే సంగతిని మర్చిపోయినట్టుందని ఒకరు కామెంట్ చేశారు. నిజానికి అడవి పందులపై ముందు నుంచి దాడి చేయడం కష్టం అని మరొకరు పేర్కొన్నారు. అడవి పందిని చూసి చిరుత పులి.. పిల్లిగా మారిపోయిందని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

సింహం vs చిరుత.. పిల్లలను కాపాడుకోవడం కోసం చిరుత ఫైటింగ్ చూశారా?


మీది డేగ చూపు అయితే.. ఈ 6ల మధ్య 9ని 5సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 09 , 2025 | 12:22 PM