Share News

Dream Science: కలలో ఈ శివలింగాన్ని చూస్తే.. మీ జీవితంలో జరిగేది ఇదే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 01:20 PM

శివుని విగ్రహం లేదా శివలింగాన్ని కలలో చూడటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కధనంలో శివునికి సంబంధించిన కొన్ని కలల అర్థాలను తెలుసుకుందాం..

Dream Science: కలలో ఈ శివలింగాన్ని చూస్తే.. మీ జీవితంలో జరిగేది ఇదే..

Dream Science: మనిషి నిద్రలో ఉన్నప్పుడు కలలు కనడం సాధారణం. కలలు ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని కలలో దేవళ్లు, దేవతులు వస్తే మరికొన్ని కలలో దయ్యాలు వచ్చి మనలను భయపెడతాయి. అయితే, డ్రీమ్ సైన్స్ ప్రకారం, ప్రతి కల మనల్ని భవిష్యత్తు సంఘటనల వైపు చూపిస్తుందని అంటారు. ఈ కధనంలో శివునికి సంబంధించిన కొన్ని కలల అర్థాలను తెలుసుకుందాం..

శివుని విగ్రహం లేదా శివలింగాన్ని కలలో చూడటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కలలో శివుడిని ఏ రూపంలో చూసినా జీవితంలో ఎన్నో అద్బుత మార్పులు వస్తాయని నమ్మకం. శివలింగానికి నీటిని సమర్పించడం లేదా కలలో పూజించడం జీవితంలో అత్యంత అనుకూలమైన ఫలితాలను తెస్తుంది.

శివునికి సంబంధించిన కొన్ని కలల అర్థాలు

  • మీరు శివునికి అంకితమైన అనుచరులైతే మీరు మీ కలలో శివలింగాన్ని పూజించడం చూస్తే, అది చాలా సానుకూల సంకేతంగా పరిగించబడుతుంది. కలలో శివుడిని చూడటం మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది. మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది.

  • మీరు మీ కలలో శివలింగాన్ని చూస్తే, అది చాలా అదృష్టం. కలలో శివలింగాన్ని చూస్తే, మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని నెరవేరుతుంది. ఆ ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు, శివుని ఆశీస్సులు మీకు ఉంటాయి.

  • మీరు కలలో శివలింగాన్ని ఆరాధిస్తే, మీ జీవితంలోని ప్రతికూల ప్రభావాలన్నీ మాయమవుతాయని అర్థం చేసుకోండి. అలాంటి కల మంచి సమయం ఆసన్నమైందని, పాత సమస్యలు పరిష్కారమవుతాయని సూచిస్తుంది.


  • మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని ఆరాధించడం చూస్తే, మీరు మీ పనిలో శ్రద్ధగా, నిజాయితీగా పాల్గొంటున్నారని సూచిస్తుంది. అంతేకాకుండా, మీ ప్రయత్నాలలో మీ కుటుంబం మీకు మద్ధతు ఇస్తుంది. అలాంటి కల మీ కార్యాలయంలో ఉన్న ఇబ్బందిని త్వరలో ముగుస్తుందని సూచిస్తుంది. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. ఈ రకమైన కల పురోగతి, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

  • మీరు మీ కలలో తెలుపు లేదా పాలరాతి శివలింగాన్ని చూస్తే, రాబోయో కాలంలో మీరు లేదా కుటుంబ సభ్యులు తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకోవచ్చు. మీ జీవితంలో ఏదైనా మంచి జరగబోతోందని ఇది సంకేతంగా పరిగణించబడుతుంది.

  • కలలో శివాలయం మెట్లు ఎక్కడం నిజ జీవితంలో కూడా చాలా సానుకూల శకునంగా పరిగణించబడుతుంది. మీరు మీ జీవితంలో ఆనందం, శాంతి వైపు పురోగమిస్తున్నారని అర్థం. పోరాటం దశ ముగియబోతోంది. త్వరలో మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది, మీ కోరికల ప్రకారం ప్రతిదీ జరుగుతుంది.

  • Also Read: మహా కుంభమేళాలో గ్రీకు ప్రియురాలిని పెళ్లాడిన భారతీయుడు..

Updated Date - Jan 28 , 2025 | 01:51 PM