Salman Khan Goes Biking: ప్రాణాలను రిస్క్ చేసిన సల్మాన్.. పుట్టిన రోజు నాడు బైక్ రైడ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 03:11 PM
పుట్టిన రోజు నాడు ఆయన ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో కాకుండా బైకులో ప్రయాణించారు. ఆయనే స్వయంగా బైక్ నడిపారు. పన్వెల్‌లోని ఫామ్ హౌస్‌లో బైకు మీద చక్కర్లు కొట్టారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను టార్గెట్ చేసింది. ఇప్పటికే పలు మార్లు ఆయనను చంపటానికి ప్రయత్నించింది. అయితే, ఆయన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణ హాని ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తోంది. ఇంటినుంచి బయటకు వచ్చిన ప్రతీ సారి ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటున్నారు. ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించుకున్నారు.
అంతేకాదు.. ఎక్కడికి వెళ్లినా బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళుతున్నారు. అయితే, పుట్టిన రోజు నాడు ఆయన ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో కాకుండా బైకులో ప్రయాణించారు. ఆయనే స్వయంగా బైక్ నడిపారు. నిన్న(శనివారం) 60వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పన్వెల్‌లోని ఫామ్ హౌస్‌లో బైకు మీద చక్కర్లు కొట్టారు. సల్మాన్ బైకు నడుపుతున్న సమయంలో ఆయన వెంట వై ప్లస్ సెక్యూరిటీ ఉంది. ముందు, వెనుక సెక్యూరిటీ కార్లు రోడ్డుపై వెళుతుండగా ఆయన వాటి మధ్యలో బైకు నడిపారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దమ్ముంటే భాయ్‌ని పట్టుకోండి చూద్దాం. అది మా సల్మాన్ భాయ్ ధైర్యం’..‘భాయ్ నేరుగా కిక్ 2 షూటింగ్ నుంచి వస్తున్నట్లు ఉన్నాడు’..‘ఆయన బైకుపై వస్తుంటే జింకలు భయపడి పొదల్లో దాక్కున్నట్లు ఉన్నాయి’..‘సల్మాన్ భాయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 366ల మధ్యలో 363 ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు