Jawan Rescues Man: రైలు పైకి ఎక్కిన వ్యక్తి.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:21 AM
ఓ వ్యక్తి రైలు పైకి ఎక్కాడు. హై టెన్షన్ వైర్ల కింద నడవసాగాడు. అతడు చేతులు పైకి ఎత్తి ఉంటే ప్రాణాలు పోయేవి. ఇలాంటి సమయంలో రైల్వే పోలీసు దేవుడిలా వచ్చి అతడ్ని కాపాడాడు.
ఈ మధ్య కాలంలో రైల్వే స్టేషన్లలో ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. ప్రమాదాల్లో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే.. మరికొంత మంది రైల్వే పోలీసుల పుణ్యమా అని బతికి బయటపడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి రైలు పైకి ఎక్కాడు. హై టెన్షన్ వైర్ల కింద నడవసాగాడు. అతడు చేతులు పైకి ఎత్తి ఉంటే ప్రాణాలు పోయేవి. ఇలాంటి సమయంలో రైల్వే పోలీసు దేవుడిలా వచ్చి అతడ్ని కాపాడాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని మౌహార్ పతాక్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ రైలు ఆగి ఉంది.
ఇలాంటి సమయంలో మానసిక పరిస్థితి బాగోలేని ఓ వ్యక్తి రైలు పైకి ఎక్కాడు. ఏసీ కోచ్ మీద నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అతడి తలకు కొంత పైన హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. అతడు ఏమాత్రం చేతులుపైకి ఎత్తినా ప్రాణాలు పోయేవి. రైలు మీదకు ఎక్కి నడుస్తున్న అతడ్ని చూసి ప్లాట్ ఫామ్ మీద ఉన్న ప్రయాణీకులు కేకలు వేయటం మొదలెట్టారు. ఇది గమనించిన రైల్వే పోలీస్ ఒకరు వెంటనే రైలు పైకి ఎక్కారు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. బలవంతంగా రైలుపై పడుకోబెట్టాడు. ప్రయాణీకుల సాయంతో అతడ్ని కిందకు దించాడు. అయితే, ఇందుకోసం ఆ పోలీస్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.
కిందకు దించుతున్నపుడు ఆ వ్యక్తి ఎదురు తిరిగాడు. పోలీస్‌పై దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఓ ఇద్దరు ప్రయాణీకులు పైకి ఎక్కారు. అతి కష్టం మీద అతడ్ని కిందకు దించారు. దీన్నంతా ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ వ్యక్తిని కాపాడిన వారిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్త్రీలను ఆకర్షించే పురుషుల లక్షణాలు ఇవే!
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!