Share News

Dog vs roadrunner: ఈ పక్షిని పట్టుకోవడం చాలా కష్టం.. రోడ్డు మీద ఎంత వేగంగా పరిగెత్తిందో చూడండి..

ABN , Publish Date - Nov 05 , 2025 | 07:32 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.

Dog vs roadrunner: ఈ పక్షిని పట్టుకోవడం చాలా కష్టం.. రోడ్డు మీద ఎంత వేగంగా పరిగెత్తిందో చూడండి..
real life roadrunner

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పక్షికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (real life roadrunner).


@buitengebieden అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ రోడ్ రన్నర్ పక్షి కనబడుతోంది. సాధారణంగా గాల్లో ఎగిరే పక్షులు నేల మంది అంత వేగంగా పరుగులు పెట్టలేవు. ఏదైనా ఆపద వస్తే వెంటనే గాల్లోకి ఎగిరిపోతాయి. అయితే రోడ్ రన్నర్ పక్షి మాత్రం అందుకు భిన్నం. అది నేల మీద కూడా చాలా వేగంగా పరుగులు పెట్టగలదు. తాజగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ రోడ్ రన్నర్ పక్షిని అడవి కుక్క పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ కుక్కకు దొరక్కుండా ఆ పక్షి అత్యంత వేగంగా పరుగులు పెట్టింది (viral animal race).


సాధారణంగా అడవి కుక్కలు కూడా చాలా వేగంగా పరిగెడతాయి (bird speed challenge). అలాంటి కుక్కకు కూడా అందకుండా ఆ పక్షి మరింత వేగంగా పరుగులు పెట్టడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 2.4 లక్షల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ ప్రకృతి ఒక్కో జంతువుకు ఒక్కో సామర్థ్యం ఇచ్చిందని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 05 , 2025 | 07:32 PM