Holi stain Removal: హోలీ రంగులు వదలక సతమతం అవుతున్న వారు ఇలా చేస్తే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 10:48 AM
దుస్తులపై హోలీ రంగుల మరకలు వదలక ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్
ఇంటర్నెట్ డెస్క్: నిన్న భారతీయులంతా హోలీ పండగలో తెగ ఎంజాయ్ చేశారు. రంగుల కేళిలో మైమరిచిపోయారు. అయితే, నిన్న దుస్తులపై మరకలను చూసుకుని వణికిపోయే వారూ ఉన్నారు. రంగుల మరకలతో బట్టలు పాడైపోయాయని టెన్షన్ పడుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యలు సులువుగా తొలగిపోతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా (Tips to Remove stains from Clothes)..
దుస్తులపై మొండి మరకలకు నిమ్మరసం ఉప్పు చక్కని పరిష్కారమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇందుకు కోసం నిమ్మరసానికి కొద్దిగా ఉప్పు జోడించాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మరక ఉన్న ప్రాంతంపై రుద్ది ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత మరకపై వేడి నీళ్లు పోసి కడిగేస్తే మరక మాయం అవుతుంది. తెల్లని దుస్తులపై మరకలను తొలగించేందుకు ఇది చక్కని మార్గమని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
Harsh Goenka wealth tips: ధనవంతులు కావాలనుందా.. ఈ పారిశ్రామికవేత్త చెప్పిన 6 సూత్రాలను ఫాలో అయితే..
బేకింగ్ సోడా పేస్ట్
వదలని మరకలను బేకింగ్ సోడా కూడా బాగా ఉపయగ పడుతుంది. తెల్లని దుస్తులపై మరకలను ఈ చిట్కాతో సులువుగా వదిలించుకోవచ్చు. ఇందు కోసం బేకింగ్ సోడాకు నీరు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్టును మరకపై రుద్ది కనీసం 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత వేడి నీటితో కడిగితే మరక మాయం అయిపోతుంది.
Injured Monkey treated in Pharmacy: మనుషులను చూసి తెలివి నేర్చిన కోతి.. చేతికి గాయం కావడంతో...
వెనిగర్‌తో మరకల నుంచి విముక్తి
వెనిగర్ కూడా మరకలను పూర్తిగా తొలగిస్తుంది. ముందుగా వెనిగర్‌న మరక ఉన్న చోట వేసి అలాగే వదిలేయాలి. ఆ తరువా అది ఎండిపోయాక, వేడి నీటితో కడగాలి. ఈ చిట్కాతో కూడా మొండిమరకలను సులువగా వదిలించుకోవచ్చు. ఇదే కాకుండా నాన్ క్లోరిన్ బ్లీచ్ వాడితే మొండి మరకలు సులువుగా వదిలిపోతాయి.
చిన్న చిన్న మరకలను డిటర్జెంట్‌తో కూడా వదిలించుకోవచ్చు. ఇందుకోసం వేడి నీళ్లు కూడా ఉపయోగించాలి. వేడి నీళ్లల్లో డిటర్జెంట్ వేసి దస్తులను నానబెట్టి ఉతికితే చిన్న చిన్న మరకలు సులువుగా వదిలిపోతాయి. అయితే, మరక పడిన వెంటనే దుస్తులను ఉతికితే అవి సులువగా తొలగిపోతాయన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక మరకలు అస్సలు వదలట్లేదనుకున్న పక్షంలో డ్రై క్లీనింగ్ కూడా ప్రయత్నించవచ్చు.