No Entry Into Building: పుట్టిన రోజు వేడుకలు.. మీడియాకు రణ్‌బీర్ రిక్వెస్ట్..
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:47 PM
అపార్ట్‌మెంట్ గేటు లోపలికి మీడియాను కానీ, అభిమానులను కూడా రానివ్వలేదు. సెక్యూరిటీ విషయమై వారిని బయటే ఆపేశారు. దీంతో ఓ పాపరాజీ రణ్‌బీర్ కపూర్‌ను గేటు దగ్గరకు పిలిచాడు. మీడియాకు మాత్రం లోపలికి అనుమతి ఇవ్వాలని కోరాడు.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘రణ్‌బీర్ కపూర్’. యానిమల్ సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. యానిమల్ సినిమా రణ్‌బీర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆయన ప్రస్తుతం లవ్ అండ్ వార్, రామాయణ సినిమాల షూటింగులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ రోజు (ఆదివారం) పుట్టిన రోజు కావటంతో షూటింగులకు బ్రేక్ ఇచ్చారు. బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో మీడియా, అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు.
అయితే, అపార్ట్‌మెంట్ గేటు లోపలికి మీడియాను కానీ, అభిమానులను కూడా రానివ్వలేదు. సెక్యూరిటీ విషయమై వారిని బయటే ఆపేశారు. దీంతో ఓ పాపరాజీ రణ్‌బీర్ కపూర్‌ను గేటు దగ్గరకు పిలిచాడు. మీడియాకు మాత్రం లోపలికి అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇందుకు రణ్‌బీర్ స్పందిస్తూ.. ‘బిల్డింగ్‌లోకి అనుమతి లేదు యార్’ అని చెప్పారు. ఆ పాపరాజీ మరీ రిక్వెస్ట్ చేయటంతో గేటు ఓపెన్ చేయించాలని అనుకున్నారు. అయితే, క్రౌడ్ ఎక్కువగా ఉండటతో సిబ్బంది వద్దని అన్నారు. దీంతో రణ్‌బీర్ అక్కడినుంచి వెళ్లిపోయారు.
రణ్‌బీర్ అక్కడినుంచి వెళ్లిపోతున్నపుడు మీడియా, అభిమానులు ఆర్కే, ఆర్కే అంటూ అరవటం మొదలెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రణ్‌బీర్ పోలీస్ కేసులో చిక్కుకున్నారు. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఆయన ఈ సిగరేట్ తాగుతూ నటించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ల చట్టాన్ని అతిక్రమించినందుకు గానూ జాతీయ మానవహక్కుల కమిషన్ ఆయనపై సీరియస్ అయింది. రణ్‌బీర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
ఊహించని విషాదం.. టెంకాయ ప్రాణం తీసింది..
మానవత్వం బతికే ఉంది.. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..