Ram Charan Meets Karnataka CM: కర్ణాటక సీఎంను కలిసిన రామ్ చరణ్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:08 PM
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను ఆదివారం కలిశారు. కొన్ని నిమిషాల పాటు ముఖ్యమంత్రితో ముచ్చటించారు. చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ విశేషాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. భేటీ ముగిసిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రముఖ తెలుగు హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ రోజు మైసూరులో నన్ను కలిశారు. కొద్దిసేపు నాతో ముచ్చటించారు’ అని అన్నారు. మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేశారు.

మైసూర్‌లో ‘పెద్ది’ షూటింగ్..
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ప్రస్తుతం మైసూర్ షెడ్యూల్ నడుస్తోంది. అయితే, నిన్న(శనివారం) అల్లు రామలింగయ్య భార్య(చరణ్ అమ్మమ్మ) కనకరత్నమ్మ చనిపోవటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. విషయం తెలియగానే చరణ్ హుటాహుటిన మైసూర్‌నుంచి హైదరాబాద్ వచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మళ్లీ మైసూర్ వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
వచ్చే ఏడాది మార్చిలో పెద్ది రిలీజ్..
పెద్ది సినిమాకు ‘ఉప్పెన’ సినిమా ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో ఊరమాస్ లుక్కులో కనిపించనున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ది సినిమా 2026, మార్చి 27వ తేదీన విడుదల కానుంది. ఇదే రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావటం విశేషం. ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి
14 ఏళ్ల తర్వాత ఆగస్టులోనే అత్యధిక వర్షపాతం..ఈ ప్రాంతాల్లో భారీగా నమోదు..