Crocodile attacks python: పక్షిని తినేందుకు రెడీ అవుతున్న కొండచిలువ.. మెల్లిగా వచ్చిన మొసలి ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:59 PM
క్రూర మృగాలకు చెందిన వేట వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విందు భోజనానికి సిద్ధమవుతున్న కొండచిలువకు ఓ మొసలి షాకిచ్చింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా క్రూర మృగాల (Wild Animals)కు చెందిన వేట వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Hunting Videos). ఆ వీడియోలో విందు భోజనానికి సిద్ధమవుతున్న కొండచిలువకు (Python) ఓ మొసలి (Crocodile) షాకిచ్చింది.
ఆ వీడియోను రాజ్‌పుత్ రాజ్ అనే ఫేస్‌బుక్ యూజర్ పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నది ఒడ్డున ఓ కొండచిలువ ఓ పక్షిని పట్టుకుని దానిని తినడానికి రెడీ అవుతోంది. ఆ సమయంలో నీటిలో నుంచి ఓ మొసలి మెల్లిగా ఒడ్డు వరకు వచ్చింది. హఠాత్తుగా ఆ కొండచిలువను పట్టుకుంది. పక్షితో సహా ఆ కొండచిలువను నీటిలోకి లాక్కుని వెళ్లిపోయింది. ఆ కొండచిలువకు తిరిగి దాడి చేసే అవకాశం ఇవ్వకుండా చంపేసి తినేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వేటగాడిని వేటాడే వేటగాడు కూడా ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. ఇదే ప్రకృతి న్యాయం అని మరొకరు పేర్కొన్నారు. కొండచిలువ భోజనం చేయడానికి రెడీ అవుతూ తానే స్వయంగా మరొకరికి భోజనంగా మారిపోయిందని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..